Homeటాప్ స్టోరీస్Telangana Movement:తెలంగాణ ఉద్యమకారులు.. మీ లగ్జరీ ఓ వర్గానికి ఇన్సిపిరేషన్ అంతే..

Telangana Movement:తెలంగాణ ఉద్యమకారులు.. మీ లగ్జరీ ఓ వర్గానికి ఇన్సిపిరేషన్ అంతే..

Telangana Movement: నీళ్లు నిధులు నియామకాలు వంటి వాటికోసం తెలంగాణ ఉద్యమం పుట్టింది. రెండు దశలలో తెలంగాణ ఉద్యమం సాగింది. చివరికి అనేక బలిదానాలు.. పోరాటాలు.. రైలు రోకోలు.. సకలజనుల సమ్మె.. మిలియన్ మార్చ్.. ఇలా అనేక దశలలో పోరాటం జరిగిన తర్వాత తెలంగాణ ఏర్పాటు సాకారమైంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత చాలామంది మంత్రులయ్యారు. ఎమ్మెల్యేలయ్యారు. ఇంకా అనేక పదవులను దక్కించుకున్నారు.. అయితే వీరి ఆదాయంలో.. లాభాలలో పూర్తిగా మార్పులు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన […]

Telangana Movement: నీళ్లు నిధులు నియామకాలు వంటి వాటికోసం తెలంగాణ ఉద్యమం పుట్టింది. రెండు దశలలో తెలంగాణ ఉద్యమం సాగింది. చివరికి అనేక బలిదానాలు.. పోరాటాలు.. రైలు రోకోలు.. సకలజనుల సమ్మె.. మిలియన్ మార్చ్.. ఇలా అనేక దశలలో పోరాటం జరిగిన తర్వాత తెలంగాణ ఏర్పాటు సాకారమైంది.

తెలంగాణ ఏర్పాటు తర్వాత చాలామంది మంత్రులయ్యారు. ఎమ్మెల్యేలయ్యారు. ఇంకా అనేక పదవులను దక్కించుకున్నారు.. అయితే వీరి ఆదాయంలో.. లాభాలలో పూర్తిగా మార్పులు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో అఫిడవిట్ లో వీళ్లు పేర్కొన్న ఆస్తులకు .. ఇప్పటి ఆస్తులకు అసలు పొంతనలేదు. చాలామంది నాయకులకు విస్తారమైన భూములు.. వ్యాపారాలు.. బంగారం… నగదు.. వ్యవసాయ క్షేత్రాలు.. ఇంకా అనేకం ఉన్నాయి. వాస్తవానికి ఇవన్నీ కూడా ఇప్పటి ప్రభుత్వం బయటపడుతున్న నేపథ్యంలో వారందరి అసలు వ్యవహారాలు వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వ భూములను.. అసైన్డ్ భూములను.. ఇంకా అటవీభూములను చాలామంది నాయకులు ఆక్రమించుకున్నారు. విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఇటీవల కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కొంతమంది రాజకీయ నాయకులు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో కొంతమంది హోమ్ టూర్లు కూడా చేశారు. ఆ సమయంలో వారు చూపించిన తమ విలాసవంతమైన గృహాలను చూస్తే ఎవరికైనా సరే కళ్ళు బైర్లు కావాల్సిందే. ఒక్కొక్క ఇల్లు వైకుంఠపురం మాదిరిగా ఉంది. ఈ స్థాయిలో ఆస్తులు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. తెలంగాణ ఉద్యమానికంటే ముందు.. తెలంగాణ ఏర్పాటు కంటే ముందు వీళ్ళ ఆస్తులు ఎలా ఉన్నాయి.. ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తే మాత్రం తెలంగాణ ప్రజలకు దిమ్మతిరగాల్సిందే.

ఒక నాయకుడి వద్ద లేని లగ్జరీ కార్లు లేవంటే అతిశయోక్తి కాదు. ఒక నాయకురాలికి ఏకంగా దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫా లో అత్యంత విలాసవంతమైన ఫ్లాట్లు ఉన్నాయి. ఇక ఆమెకు నగర శివారు ప్రాంతంలో ఖరీదైన విల్లాలు.. భవనాలు.. స్థలాలు ఉన్నాయి. ఇక వ్యాపారాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఒక నాయకుడు అయితే తన సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని ఎంతో సంపాదించాడు. కానీ ఈ స్థాయిలో సంపాదించిన తర్వాత. సంపాదించిన దానిని కాపాడుకోవడానికి వీళ్లకు ఉపయోగపడుతున్న ఒకే ఒక్క అస్త్రం జై తెలంగాణ.. వీళ్ళ అక్రమ ఆస్తుల గురించి చర్చ జరిగినప్పుడు.. దానిని పక్కదారి పట్టించడానికి ఎంచుకునే అస్త్రం జై తెలంగాణ. చదువుతుంటే ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఇదే నిజం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper