HomeతెలంగాణOnion Farmers Problems: అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. రైతును కన్నీరుపెట్టిస్తున్న ఉల్లి!

Onion Farmers Problems: అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. రైతును కన్నీరుపెట్టిస్తున్న ఉల్లి!

రైతుల నుంచి కిలో రూపాయికి కొనుగోలు చేస్తున దళారులు వినియోదారులకు మాత్రం కేజీ రూ.11 నుంచి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. అష్టకష్టాలు పడి పండించిన పంటకు ఒక్కసారిగా గిట్టుబాటు ధర పడిపోవడంతో రైతులకు ఏమి చేయని దీనస్థితిలో ఉన్నారు రైతులు. దీంతో తమకు ఏమీ మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Onion Farmers Problems: తెలంగాణలో ఉల్లి పండించిన రైతును కన్నీరు పెట్టిస్తోంది. బహిరంగా మార్కెట్‌లో రోజురోజుకూ ఉల్లి ధర పడిపోతుండడంతో రైతులు దిక్కుతోచని స్థితి కొట్టుమిట్టాడుతున్నారు. లాభాలు లేకున్నా ఫర్వాలేదు, కానీస పెట్టుబడులు వస్తే చాలు ఆనే ఆలోచనలో ఉల్లి రైతులు ఉన్నారు. బహిరంగ మార్కెట్‌లో క్వింటాల్‌ ఉల్లి ధర రూ.800 నుంచి రూ.900 వరకు మాత్రమే పలుకుతుండడంతో రైతులు కన్నీరు మున్నీరుమున్నీరవుతున్నారు.

ఎకరాకు రూ.30 వేల పెట్టుబడి..
ఉల్లి సాగుకు ఎకరాకు రూ.30 వేల వరకు ఖర్చవుతుంది. కానీ, పంట చేతికి వచ్చేసరికి కనీసం కూలీల డబ్బులు కూడా రాకపోవడంతో అన్నదాతలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఝరాసంగం, బర్దిపూర్, కృష్ణాపూర్, మాచునూర్, పొట్టి పల్లి, ఎల్గోయి, చిలేపల్లి, వనంపల్లి, తదితర గ్రామాలలో సాగుచేసిన ఉల్లి పంట ప్రస్తుతం చేతికి వస్తోంది. దీంతో రైతులు మార్కెట్‌కు తరలిస్తున్నారు. అయితే దళారులు కిలోకు రూ.1 కూడా చెల్లించడం లేదు. దీంతో కొంతమంది రైతులు పంట తీయకుండా చేలల్లోనే వదిలేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో కూలీలు సైతం ఉల్లి తవ్వడానికి రావడం లేదు.

దిక్కుతోచని స్థితిలో రైతులు..
పతనమవుతున్న ధరతో ఉల్లి రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. గతేడాది క్వింటాల్‌కు రూ.3 వేలకు పైగా ధర ఉండడంతో ఈ ఏడాది కూడా అదే ధర వస్తుందని భావించి రైతులు జిల్లాలో పెద్దఎత్తున ఉల్లి సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో మార్కెట్‌కు తీసుకొస్తే కిరాయిలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌ ను బట్టి క్వింటాకు రూ.800 నుంచి రూ.1,000 వరకు కొనుగోలు చేస్తున్నారు.

వినియోదారులకు రూ.15 కిలో
రైతుల నుంచి కిలో రూపాయికి కొనుగోలు చేస్తున దళారులు వినియోదారులకు మాత్రం కేజీ రూ.11 నుంచి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. అష్టకష్టాలు పడి పండించిన పంటకు ఒక్కసారిగా గిట్టుబాటు ధర పడిపోవడంతో రైతులకు ఏమి చేయని దీనస్థితిలో ఉన్నారు రైతులు. దీంతో తమకు ఏమీ మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.

గదులు అద్దెకు తీసుకుని..
మార్కెట్‌లో ధర లేకపోవడంతో కొంతమంది రైతులు గదులు అద్దెకు తీసుకుని నిల్వ చేస్తున్నారు. మరికొందరు రైతులు చేసేది ఏమీ లేక మార్కెట్‌ తరలిస్తున్నారు. నిల్వ చేయడం వలన సీజన్‌ ముగిసిన తర్వాత ధర పెరుగుతుందని ఆలోచిస్తున్నాయి. అయితే అప్పటి వరకు అద్దె చెల్లించాల్సిన పరిస్థితి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper