HomeతెలంగాణMedaram Jatara 2026: మేడారంలో అద్భుతం.. ఇది సమ్మక్క సాక్షాత్కారమేనట!

Medaram Jatara 2026: మేడారంలో అద్భుతం.. ఇది సమ్మక్క సాక్షాత్కారమేనట!

Medaram Jatara 2026: మేడారం మహా జాతర ఘనంగా ముగిసింది. గద్దెల వద్దకు సమ్మక్క సారలమ్మ వచ్చారు. వన ప్రవేశం కూడా చేశారు. కొద్దిరోజుల పాటు భక్తులతో కిటకిటలాడిన ఆ అరణ్యం ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. కోట్లాదిమంది భక్తులు వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం భక్తజన గుడారం మాదిరిగా మారిపోయింది. మేడారం జాతర ముగిసిన తర్వాత పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతాయి. మళ్లీ ఆ ప్రాంతాలు ఎప్పటిలాగానే ఉండిపోతాయి. భక్తులు భారీగా వస్తుంటారు కాబట్టి […]

Medaram Jatara 2026: మేడారం మహా జాతర ఘనంగా ముగిసింది. గద్దెల వద్దకు సమ్మక్క సారలమ్మ వచ్చారు. వన ప్రవేశం కూడా చేశారు. కొద్దిరోజుల పాటు భక్తులతో కిటకిటలాడిన ఆ అరణ్యం ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. కోట్లాదిమంది భక్తులు వచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంతం మొత్తం భక్తజన గుడారం మాదిరిగా మారిపోయింది.

మేడారం జాతర ముగిసిన తర్వాత పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతాయి. మళ్లీ ఆ ప్రాంతాలు ఎప్పటిలాగానే ఉండిపోతాయి. భక్తులు భారీగా వస్తుంటారు కాబట్టి చెత్త కూడా అదే స్థాయిలో పేరుకు పోతూ ఉంటుంది. ఆ వ్యర్ధాలను శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య సిబ్బందికి చాలా రోజుల సమయం పడుతుంది. గతంలో మేడారం జాతర ముగిసిన తర్వాత గత్తర వచ్చేది అంటారు. ఆ సమయంలో చాలామంది ప్రాణాలు కోల్పోయేవారట. అయితే ఇప్పుడు ఎప్పటికప్పుడు ఆ పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తున్న నేపథ్యంలో ఆ స్థాయిలో గత్తర రావడం లేదు. పైగా స్నాన ఘట్టాలు.. మరుగుదొడ్లు.. మూత్రశాలలు నిర్మించడంతో భక్తులు అంతగా ఇబ్బంది పడడం లేదు. దీనికి తోడు పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో భక్తులు అంతగా ఇబ్బంది పడడం లేదు.

మేడారం జాతర ముగిసిన నేపథ్యంలో అక్కడ ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. వాస్తవానికి సమ్మక్క సారలమ్మ గద్దెల మీదికి వచ్చేటప్పుడు వాతావరణం ఒక్కసారిగా మారిపోతూ ఉంటుంది. ఆకాశం ఎరుపు వర్ణాన్ని సంతరించుకుంటూ ఉంటుంది. అకస్మాత్తుగా గాలి వీస్తూ ఉంటుంది. ఆకాశంలో చందమామ వెలిగిపోతూ ఉంటాడు. చిలకలగుట్ట నుంచి మొదలు పెడితే గద్దె వరకు అమ్మవార్లను ప్రతిష్టించే ప్రతి ఘట్టం కూడా అద్భుతంగా ఉంటుంది. అందువల్లే ఆ దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు మేడారంలోనే మకాం వేస్తారు. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని సమ్మక్క గద్దె మీద కు వచ్చిన తర్వాత దర్శించుకుని వెళ్తారు.

అయితే ఇప్పుడు జాతర ముగిసిన నేపథ్యంలో అక్కడ వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. ఆ పరిసర ప్రాంతంలో ఇటీవల హోరు గాలి వచ్చింది. ఆ గాలిలో వ్యర్ధాలు మొత్తం కొట్టుకుపోయాయి. ఆ పరిసర ప్రాంతాలు చూస్తుండగానే పరిశుభ్రంగా మారిపోయాయి. ఇదంతా కూడా సమ్మక్క మహిమ అని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. గతంలో ఎన్నడు ఇలా లేదని.. ఇప్పుడు సమ్మక్క స్వయంగా వచ్చి తన పరిసరాలను శుభ్రం చేసిందని భక్తులు చెబుతున్నారు. ఆ గాలి వచ్చి.. వ్యర్ధాలను తనతో తీసుకెళుతున్న దృశ్యాలను కొంతమంది వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సమ్మక్క దర్శనానికి ఇదే నిదర్శనం అని నెటిజన్లు పేర్కొంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Manoj Karmakonda (@hyderabadmemories)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper