Konda Surekha And Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చివరికి పండుగ పూట కూడా రెస్ట్ తీసుకునే విధంగా ఉండడం లేదు. రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచే విధంగా.. తలలు పండిన రాజకీయ నాయకులను సైతం విస్మయానికి గురి చేసే విధంగా సాగుతున్నాయి.
మొన్నటికి మొన్న పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించినప్పుడు.. ఆ వేదిక మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేపూరి ప్రకాష్ రెడ్డి మళ్ళీ పోటీ చేస్తారని ప్రకటించారు. ఇది దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తెకు ఆగ్రహాన్ని కలిగించింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సంప్రదాయాన్ని పక్కనపెట్టి.. ఒక ముఖ్యమంత్రి రేపురి ప్రకాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నెత్తికి కళ్ళు ఎక్కాయని మండిపడ్డారు. అక్కడితోనే ఆగలేదు ఆమె రేవంత్ రెడ్డికి కుడివైపు పొంగు ఉందని.. అది త్వరలోనే తగ్గిపోతుందని అన్నారు. ఆ తర్వాత తెలంగాణ రాజకీయాలలో ఊహించని విధంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి
ఒక బిల్డర్ మీద దాడి చేసినందుకు కొండా సురేఖ మాజీ ఓఎస్డి సుమంత్ డ్రైవర్ మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. చివరికి సుమంత్ ను కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొండా సురేఖ ఏరి కోరి తెచ్చుకున్న అధికారులను వారి మాతృ స్థానాలకు పంపించారు. కొండా సురేఖకు అడుగడుగునా అష్టదిగ్బంధం కలిగించారు. దీనికి తోడు కొండా సురేఖ ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ను కలిశారు. వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు. కాకపోతే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించాలని సూచించింది. వీటి కంటే ముందు కొండా సురేఖ రాసిన లేఖలు మీడియాలో సంచలనంగా మారాయి. తనను ఒక అదృశ్య శక్తి ఇబ్బంది పడుతోందని ఆమె అందులో ప్రస్తావించారు. కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. అదే సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడికి వెళ్లారు. ఇవన్నీ పరిణామాలు ఒకదాని తర్వాత ఒకటి జరిగిన తర్వాత.. సురేఖకు మంత్రి పదవి తొలగిపోవడం ఖాయమని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే సురేఖ రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు.
శుక్రవారం రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని ఆమె తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆమె వెంట కొండా మురళి కూడా ఉన్నారు. రాఖీ పౌర్ణ సందర్భంగా కొండ సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టినట్టు తెలుస్తోంది. కొండా సురేఖ.. కొండ మురళి సంయుక్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయినట్టు సమాచారం. వీరి మధ్య ఏం చర్చలు జరిగాయి అనేది తెలియక పోయినప్పటికీ.. ముఖ్యమంత్రి వెంటనే అపార్ట్మెంట్ ఇవ్వడంతో.. కొండ సురేఖ పదవికి ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది. అయితే రేవంత్ తనని విమర్శిస్తే ఊరుకునే రకం కాదు. అలాంటప్పుడు కొండా సురేఖ కుమార్తె విమర్శలను ఆయన ఎలా తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది.