తెలంగాణహైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్..?

హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పిన సీఎం కేసీఆర్..?


తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ హైదరాబాద్ వాసులకు శుభవార్త చెప్పింది. రోజురోజుకు ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉల్లి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది కిలో 160 రూపాయలకు చేరిన ఉల్లి ఈ సంవత్సరం కూడా రిటైల్ మార్కెట్ లో 100 రూపాయలకు పైగా పలుకుతుండటం గమనార్హం. దీంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా సబ్సిడీ ఉల్లి విక్రయాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మార్కెట్ లో కిలో 40 రూపాయల చొప్పున ఉల్లి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రాయితీ ఉల్లి విక్రయాలు ఉదయం 11 గంటల నుంచి మొదలు కానుండగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. బహిరంగ మార్కెట్ ధరలతో పోలిస్తే సగం కంటే తక్కువ ధరకే ప్రభుత్వం ఉల్లి అమ్మకాలు చేపడుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ప్రయోజనకరంగా ఉండనుంది.

దసరా, బతుకమ్మ పండగల నేపథ్యంలో ఉల్లికి డిమాండ్ పెరిగింది. తెలంగాణ సర్కార్ భవిష్యత్తులో ఇతర మార్కెట్లలో కూడా సబ్సిడీ ఉల్లి విక్రయాలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. వర్షాలు, వరదల వల్ల ఉల్లి పంట దిగుబడి తగ్గడంతో రేట్లు పెరిగాయి. నెల రోజుల క్రితం వరకు 100 రూపాయలకు 5 కిలోల చొప్పున అమ్మిన వ్యాపారులు ప్రస్తుతం కిలో ఉల్లి 100 రూపాయలు చెబుతున్నారు.

మరోవైపు ఏపీలో ఇప్పటికే సబ్సిడీ ఉల్లిపాయల విక్రయాలు జరుగుతున్నాయి. మార్కెట్ లో 40 రూపాయలకే ప్రభుత్వం ఉల్లిని విక్రయిస్తోంది. తక్కువ ధరకే జగన్ సర్కార్ ఉల్లిని ఇస్తుండటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

FIFA World Cup : 19, 20 తేదీల్లో అర్ధరాత్రి మద్యం అమ్మకాలు.. ఎందుకంటే..

FIFA World Cup : తెలంగాణలో ఫిఫా వరల్డ్ కప్‌ ప్రసారాల నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని బార్లు, క్లబ్బులు, మైక్రోబ్రూవరీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా పని వేళలు పొడిగించింది. ఈ నెల 19న తెల్లవారుజామున...

Ram Charan Farmhouse : వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం..

Ram Charan Farmhouse : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఏంటి?, వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టడం ఏంటి?, మొన్ననే కదా పెద్ది చిత్రం తో ఏకంగా 400 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టారు,...

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Skyroot Aerospace

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

Malla Reddy : మల్లారెడ్డి హ్యాండిచ్చాడు.. బీఆర్ఎస్ కారాలు మిరియాలు.. ట్విస్ట్ అదిరింది కదూ

Malla Reddy : మైక్ పట్టుకుంటే చాలు మల్లారెడ్డి కేటీఆర్.. కెసిఆర్.. హరీష్ రావు మీద పొగడ్తల వర్షం కురిపిస్తూ ఉంటారు. నూరేళ్లు కాదు వెయ్యిళ్లు బతకాలని కోరుతుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని బాగు...
Harish Rao

Harish Rao: బామ్మర్ది కేటీఆర్ ను సైడ్ చేసిన హరీష్.. ఏదో జరుగుతోంది

Harish Rao: భారత రాష్ట్ర సమితి ఓవైపు సోషల్ మీడియాలో బలంగా కనిపిస్తుంది. ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్.. హరీష్ రావు నిత్యం ఆందోళనలకు పిలుపునిస్తూ ఉంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం...