Amit Arora : వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. కాలేజీలో చదువుతున్నప్పుడే వారికి జీవితం మీద ఒక క్లారిటీ ఉండేది. అందులో ఏమాత్రం కన్ఫ్యూజ్ లేదు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు. వాళ్ళ వేతనాలు కూడా గొప్ప స్థాయిలోనే ఉన్నాయి.
హై ప్రొఫైల్ జీవితం గడుపుతున్నవారు పిల్లాపాపలతో ఆనందంగా ఉంటారని బంధువులు అంచనా వేశారు. పెళ్లయిన రెండు సంవత్సరాల నుంచి పిల్లలు ఎప్పుడు అని అడగడం మొదలుపెట్టారు. కానీ ఎన్నడూ కూడా పిల్లల గురించి ఆ దంపతులు గుడ్ న్యూస్ చెప్పలేదు. సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వారి దగ్గర నుంచి ఎటువంటి శుభవార్త లేకపోవడంతో బంధువులు ఆరా తీశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వారిద్దరికీ గొప్ప గొప్ప వేతనాలు ఉన్నప్పటికీ.. ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నప్పటికీ.. పిల్లలు వద్దనే డిసైడ్ చేసుకున్నారు. ఈ కల్చర్ను ఇప్పుడు ఇండియాలో డబల్ ఇన్కమ్.. నో కిడ్స్ అని చెబుతున్నారు. సింపుల్ గా దీనిని డింక్ అని పిలుస్తున్నారు.
ఆ ఇద్దరు దంపతులు రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి 3.2 కోట్లు సంపాదించారు. స్టాక్స్.. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా 6.8 కోట్లు సంపాదించారు. క్యాష్.. రిటైర్మెంట్ సేవింగ్స్ ద్వారా 1.5 కోట్లు సంపాదించారు. ప్రతి ఏడాది 22 లక్షల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 38 సంవత్సరాల వయసుకు వచ్చిన తర్వాత.. ఉద్యోగాలు అవసరం లేదని నిర్ణయించుకున్నారు. ఉద్యోగాలకు రాజీనామా చేశారు. కెరియర్ కంటే.. హెల్త్ మాత్రమే ముఖ్యమని వాళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు.
ఇదే విషయాన్ని బంధువులతో చెప్పారు. ఎన్ని కోట్లు సంపాదించినా పోతున్నప్పుడు తీసుకెళ్లడానికి ఏదీ ఉండదు. నేటి కాలంలో ఉద్యోగాలు చేసే వాళ్లకు తీరిక ఉండడం లేదు. ఒకవేళ పిల్లలను కన్నప్పటికీ వారిని ఎక్కడో ప్లే స్కూల్లో వేయాల్సివస్తుంది. నిత్యం వారి గురించి ఒత్తిడి.. ఇలా ఉంటున్నారు అని ఆందోళన.. ఇవన్నీ ఇబ్బందులు పడేకంటే.. ఉన్నంతవరకు స్వేచ్ఛగా ఉండడం.. ఆరోగ్యంగా ఉండడం ముఖ్యమని వారిద్దరు అనుకున్నారు. అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ సభ్యులు.. బంధువులు వద్దని వారించినప్పటికీ.. వారు తమ నిర్ణయం మార్చుకోలేదు. అయితే ఈ దంపతులు ఎవరు అని.. కొంతమంది ఆరా తీస్తే.. పూణేకి చెందిన అమిత్ అరోరా దంపతులు అని తేలింది.