Amrutha Pranay : అమృత(Amrutha Varshini), ప్రణయ్(Pranay) జంట మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకొని, అమృత గర్భం దాల్చిన సమయం లో హాస్పిటల్ కి వెళ్లి తిరిగి వస్తుండగా, ప్రణయ్ ని అమృత తండ్రి మారుతీ రావు అత్యంత కిరాతకంగా హత్య చేయించిన ఘటన పెద్ద దుమారమే రేపింది. ఈ వ్యవహారం లో పరువు పూర్తిగా కోల్పోయిన అమృత తండ్రి మారుతీరావు అఘాయిత్యం చేసుకున్నాడు. ఇక ఈ కేసు లో ప్రధాన నిందితుడిగా నిల్చిన వ్యక్తికీ రీసెంట్ గానే ఉరి శిక్ష పడింది. అమృత ఇన్నాళ్లు సింగల్ గానే తన కొడుకు తో కలిసి జీవితాన్ని గడుపుతూ ఉంది. అయితే నిందితుడికి ఉరిశిక్ష పడిన మరు క్షణమే అమృత తన సోషల్ మీడియా అకౌంట్స్ లో ప్రణయ్ పేరు ని తొలగించి అమృత వర్షిణి గా మార్చిన సంగతి మన అందరికీ తెలిసిందే.
Also Read : అంతా అమృతనే చేసింది.. మా నాన్నకు ఎందుకీ శిక్ష? విలపించిన కూతురు
అకస్మాత్తుగా ఇలా పేరు ఎందుకు మార్చింది, త్వరలోనే ఈమె రెండవ పెళ్లి చేసుకోబోతుందా? అనే అనుమానాలు నెటిజెన్స్ లో వ్యక్తం అయ్యాయి. అలా చేసినందుకు ఈమెపై సోషల్ మీడియా లో చాలా నెగటివిటీ కూడా పెరిగింది. ఇన్ని రోజులు ఎందుకు ఇలా పేరుని మార్చాల్సి వచ్చిందో చెప్పలేదు కానీ, రీసెంట్ గానే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజెన్స్ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పింది. ముందుగా పేరు ఎందుకు మార్చాల్సి వచ్చిందో చెప్తూ ‘కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం పేరు ని ఎప్పుడో మార్చాలి. కానీ నేను మార్చలేదు. ఇప్పుడు ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మార్చాను. అమృత వర్షిణి అనేది నా నిజమైన పేరు, నా పేరు ని నేను పెట్టుకోవడం కూడా తప్పేనా?, మీరు అందుకు ఏవేవో ఊహించుకుంటే నేను ఏమి చేసేది, నేను మామూలుగానే పేరు మార్చాను, దాని వెనుక ఎలాంటి ఉద్దేశ్యం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక రెండవ పెళ్లి చేసుకోవడం పై స్పందిస్తూ ‘మనం కోరుకున్న జీవితం దొరకడం మన చేతుల్లో లేదు కదా. నేను ఒక జీవితాన్ని కోరుకున్నాను, దేవుడు నాకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చాడో మీరే చూస్తున్నారు, అదే విధంగా భవిష్యత్తులో నా జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుందో నేను ఇప్పుడే చెప్పలేను. ఏదైనా విశేషం ఉంటే కచ్చితంగా నేనే చెప్తాను, ప్రస్తుతానికి అయితే నాకు అలాంటి ఆలోచనలు ఏమి లేవు, నేను చెప్పే వరకు ఏది నమ్మకండి, నేను ఈ రూమర్స్ పై స్పందించడం లేదంటే, అక్కడ అసలు మ్యాటర్ లేదని అర్థం’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అమృత యూట్యూబ్ లో ఎప్పటి నుండే వ్లాగ్ వీడియోస్ చేస్తూ వస్తుంది. అనేక ఇంటర్వ్యూస్ కూడా చేసింది. ఈమధ్య కాలం లో కాస్త తగ్గించింది కానీ, ఇక నుండి వరుసగా వ్లాగ్ వీడియోస్ చేస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చింది.
Also Read : ఎట్టకేలకు ప్రణయ్ కేసు తీర్పు పై తొలిసారి స్పందించిన అమృత..