AV Ranganath : ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించిన నేపథ్యంలో హైడ్రా రంగనాథ్ స్పందించారు. ఎందుకంటే ఈ ఘటన జరిగినప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్పీగా రంగనాథ్ ఉన్నారు. ప్రణయ్ ఘటన జరిగినప్పుడు.. దేశవ్యాప్తంగా సంచలనం నమోదయింది. ఇదే క్రమంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్న తీరుపై విమర్శలు కూడా వచ్చాయి. నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని కొంతమంది విమర్శించారు. దానిని పోలీసులు ఖండించారు. ఆ తర్వాత తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇక ప్రస్తుతం నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు 8 మంది నిందితులకు శిక్ష విధించడంతో.. హైడ్రా రంగనాథ స్పందించారు. అంతేకాదు తాము కేసు దర్యాప్తు జరిపిన తీర్పట్ల గర్భంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబానికి ఇన్ని సంవత్సరాల తర్వాత న్యాయం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.. 2018లో ప్రణయ్ పై దారుణం జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును రంగనాథ్ దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తును అత్యంత కట్టుదిట్టంగా నిర్వహించామని రంగనాథ్ పేర్కొన్నారు. ఈ కేసు విచారణ ఐదు సంవత్సరాలపాటు జరిగింది. ఇక ఈ కేసును చాలెంజ్ గా తీసుకొని దర్యాప్తు జరిపేమని రంగనాథ్ వెల్లడించారు.
అన్ని రూపాలలో
ఈ కేసును దర్యాప్తు చేసే క్రమంలో పోలీసులు సిసి ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని అనాలసిస్ చేయడం, హ్యూమన్ ఇన్వెస్టిగేషన్.. ఇలా రకరకాల విధానాలలో పోలీసులు అన్ని ఆధారాలు సేకరించారు. 9 నెలలపాటు శ్రమించారు. 16 00 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. 67 మంది సాక్షులను విచారించారు. వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. నాడు రంగనాథ్ ఆధ్వర్యంలో ఈ స్టేట్మెంట్లను రికార్డు చేయగా.. వాటన్నిటిని కోర్టు కీలకంగా పరిగణించింది. ఇక దర్యాప్తు కూడా పగడ్బందీగా జరిగింది. ఈ కేసులో కొన్ని సందర్భాల్లో సాక్షులు దొరకకపోయినప్పటికీ సీసీ ఫుటేజ్ ద్వారా బలమైన ఆధారాలను సేకరించామని రంగనాథ్ వెల్లడించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీసు బృందాలు ఒకే లక్ష్యంతో పని చేశాయని..నిందితులు తప్పించుకోవడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసినా పట్టుకున్నామని రంగనాథ్ పేర్కొన్నారు. అయితే ప్రణయ్ పై దారుణం చోటు చేసుకోవడానికి ప్రధాన కారణం మారుతీ రావు అని.. తన కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో పరువు పోయిందని భావించి ఆయన ఈ దారుణానికి పాల్పడ్డాడని రంగనాథ్ పేర్కొన్నారు. ప్రణయ్ పై దారుణానికి పాల్పడేందుకు కోట్ల రూపాయలు చెల్లించాడని రంగనాథ్ వెల్లడించారు.. ఈ కేసులో ప్రధాన నిందితులుగా అక్బర్ అలీ, భారీ, అసర్గాలీ కీలకంగా ఉన్నారని.. వారిని పట్టుకుని విచారిస్తే అసలు విషయాలు తెలుస్తాయని రంగనాథ్ పేర్కొన్నారు. ప్రణయ్ పై దారుణానికి పాల్పడిన తర్వాత నిందితులు రైల్లో పారిపోయేందుకు ప్రయత్నించారని.. అయితే వారిని పోలీసు బృందాలు వెంటాడు పట్టుకున్నాయని ఆ రంగనాథ్ పేర్కొన్నారు.. ఈ కేసులో అనేక ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ.. చివరికి బాధిత కుటుంబానికి న్యాయం చేయడానికి పకడ్బందీగా దర్యాప్తు చేశామని రంగనాథ్ వెల్లడించారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని రంగనాథ్ పేర్కొన్నారు. భవిష్యత్తు కాలంలో ఇటువంటి దారుణాలకు పాల్పడే వారికి శిక్ష తప్పదని ఈ కేసు ద్వారా వెల్లడైందని రంగనాధ్ వివరించారు.