HomeతెలంగాణHyderabad Footpath Ranking 2026: హైదరాబాద్ కు 3వ స్థానం.. ఇది అస్సలు ఊహించనది..

Hyderabad Footpath Ranking 2026: హైదరాబాద్ కు 3వ స్థానం.. ఇది అస్సలు ఊహించనది..

Hyderabad Footpath Ranking 2026: మన దేశంలో చాలా వరకు footpath లు ఆక్రమణకు గురై ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాల్లో పాదచారులకు అనుకూలమైన ఫుట్‌పాత్‌ లు ఎక్కడెక్కడ ఉన్నాయో ‘స్టేట్ ఆఫ్ ఇండియన్ స్ట్రీట్స్ 2026’ ఓ నివేదిక ను విడుదల చేసింది. పాదచారులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా నడిచే ఫుట్‌పాత్‌లు ఎంత మేర అందుబాటులో ఉన్నాయనే అంశంపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం దేశంలో అనుకూలమైన ఫుట్‌పాత్‌ లు ఈ నగరంలో […]

Hyderabad Footpath Ranking 2026: మన దేశంలో చాలా వరకు footpath లు ఆక్రమణకు గురై ఉంటాయి. ఈ నేపథ్యంలో
ప్రధాన నగరాల్లో పాదచారులకు అనుకూలమైన ఫుట్‌పాత్‌ లు ఎక్కడెక్కడ ఉన్నాయో ‘స్టేట్ ఆఫ్ ఇండియన్ స్ట్రీట్స్ 2026’ ఓ నివేదిక ను విడుదల చేసింది. పాదచారులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా నడిచే ఫుట్‌పాత్‌లు ఎంత మేర అందుబాటులో ఉన్నాయనే అంశంపై ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం దేశంలో అనుకూలమైన ఫుట్‌పాత్‌ లు ఈ నగరంలో ఉన్నాయో చూద్దాం..

స్టేట్ ఆఫ్ ఇండియన్ స్ట్రీట్స్ ప్రకారం..ఫుట్‌పాత్‌ ల నిర్వహణ దేశంలోని ఎంపిక చేసిన నగరాల్లో పాదచారులకు అనువైన ఫుట్‌పాత్‌ల శాతం
లక్నో 28%, బెంగళూరు 25.9%,హైదరాబాద్ 15.1%, చెన్నై 13.9%, ముంబై, 5.5% గా ఉన్నాయి. ఇతర నగరాలతో పోలిస్తే లక్నోలో పాదచారుల కోసం మెరుగైన మౌలిక సదుపాయాలు ఉండటం వల్ల మొదటి స్థానంలో నిలిచింది. నగర ప్రణాళికలో పాదచారుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఈ విజయానికి ప్రధాన కారణంగా పేర్కొన్నారు.

ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరు 25.9 శాతం ఫుట్‌పాత్‌లతో రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ 15.1 శాతంతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. నగరంలో కొన్ని ప్రధాన రహదారులపై ఆధునిక ఫుట్‌పాత్‌లు అభివృద్ధి చేసినప్పటికీ, ఇంకా విస్తృత స్థాయిలో మెరుగుదల అవసరమని నివేదిక సూచించింది.చెన్నై 13.9 శాతంతో నాలుగో స్థానంలో ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబై కేవలం 5.5 శాతంతో చివరి స్థానానికి పరిమితమైంది. అధిక జనసాంద్రత, రహదారులపై ఆక్రమణలు, పరిమిత స్థలం వంటి కారణాల వల్ల ముంబైలో పాదచారులకు అనువైన ఫుట్‌పాత్‌లు చాలా తక్కువగా ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.

భారత నగరాల్లో ఎక్కువ మంది రోజూ నడిచి ప్రయాణాలు చేస్తున్నప్పటికీ, వారికి తగిన ఫుట్‌పాత్‌లు లేకపోవడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆక్రమణలు, పార్కింగ్, నిర్మాణ పనులు, అసమానమైన ఫుట్‌పాత్‌లు పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని నివేదిక వెల్లడించింది.
నివేదిక సూచించిన మార్గదర్శకాలు
పాదచారులకు అనుకూలమైన నగరాల అభివృద్ధి కోసం అన్ని నగరాల్లో వెడల్పైన, నిరంతరాయంగా కొనసాగే ఫుట్‌పాత్‌లు, దివ్యాంగులకు అనువైన ర్యాంపులు, జీబ్రా క్రాసింగ్‌లు, సురక్షిత రోడ్డు దాటే సౌకర్యాలు, మెరుగైన వీధి లైటింగ్ వంటి మౌలిక సదుపాయాలను పెంచాల్సిన అవసరం ఉందని ‘స్టేట్ ఆఫ్ ఇండియన్ స్ట్రీట్స్ 2026’ నివేదిక స్పష్టం చేసింది. పాదచారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చినప్పుడే నగరాలు నిజమైన అర్థంలో ప్రజలకు అనుకూలంగా మారతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper