Hyderabad Mosquitoes: వానా కాలంలో సాధారణంగా ఈగలు, దోమలు ఎక్కువగా ఉంటాయి. మిగతా కాలాలతో పోల్చి చూస్తే.. వాన కాలంలో వ్యాధులు సోకడానికి.. జ్వరాలు విజృంభించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కానీ కొంతకాలంగా వానా కాలంలో జ్వర బాధితుల సంఖ్య ఊహించని విధంగా పెరుగుతోంది. పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారిపోతోంది. ముఖ్యంగా ప్లాస్టిక్ వస్తువుల వినియోగం.. పాలిథిన్ సంచుల విక్రయం.. వినియోగం అంచనాలకు మించిపోతుంది.
ఇటీవల హైదరాబాద్ నగరంలో హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఇక్కడ చెత్తను తొలగించే ప్రయత్నం చేపట్టింది. అయితే ఆ చెత్తలో దాదాపు నూటికి 90% ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉన్నాయి. అందులో పాలితిన్ సంచులు కూడా ఉన్నాయి. ఈ ప్రకారం చూసుకుంటే ఆ చెత్త మొత్తం ఒక గుట్టలాగా మారిపోయింది. దానిని తరలించాలంటే జవహర్ నగర్ డంపు కూడా సరిపోదు. దీనినిబట్టి హైదరాబాద్ నగరంలో పారిశుధ్యం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పారిశుధ్యం అధ్వానంగా ఉండడం వల్ల దోమలు.. ఈగలు స్వైర విహారం చేస్తుంటాయి. అవి వ్యాధికారక క్రిములను మోసుకొని వెళ్తూ ఉంటాయి. జ్వరాలు.. ఇతర రకాల అంటూ వ్యాధులను అవి కలిగిస్తుంటాయి. ప్రమాదకరమైన డెంగ్యూ.. చికెన్ గున్యా.. మలేరియా.. కలరా.. టైఫాయిడ్.. ఇంకా అనేక రకాల వ్యాధులకు ఈగలు, దోమలు కారణమవుతూ ఉంటాయి.
హైదరాబాద్ నగరంలో అస్తవ్యస్తంగా మారిన పారిశుధ్యం వల్ల దోమలు.. ఈగల సంతతి అసాధారణంగా పెరిగింది. వాటి తీవ్రత ఎలా ఉందో చూపించేందుకు ఓ వ్యక్తి తన ఫోన్లో వీడియో తీశాడు. లంగర్ హౌస్ ప్రాంతంలో సాయంత్ర సమయంలో అతడు తీసిన వీడియోలో దోమలు వెళ్తున్న తీరు చిన్నపాటి సైన్యాన్ని గుర్తుకు తెస్తోంది. ఆకాశంలో దోమలు గుంపుగా వెళుతున్న దృశ్యాలు ఆ వ్యక్తి తీసిన వీడియోలో కనిపించాయి. దోమలు దాదాపు లక్షల సంఖ్యలో ఉన్నాయి. అవన్నీ నాలాలు.. మురుగు కాలువలు అధికంగా ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి . ఈ దోమలను చంపాలంటే ఏ స్థాయిలో ఫాగింగ్ చేయాలి.. ఎన్ని ఆల్ అవుట్ లిక్విడ్స్ వాడాలి.. ఎన్ని గుడ్ నైట్ రీఫిల్స్ వాడాలి.. దోమల సంఖ్య పెరగకూడదు అనుకుంటే.. ఈగలు విస్తారంగా ఉండకూడదు అనుకుంటే పారిశుద్యాన్ని పాటించాలి. కేవలం మన ఇల్లు మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు.. వీధులు కూడా శుభ్రంగానే ఉండాలి. అప్పుడే దోమలు రాకుండా ఉంటాయి. ఈగలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.
భారీగా పెరిగిన దోమలు
హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లో దోమలు గుంపులుగా తిరుగుతున్న దృశ్యాలను స్థానికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కలకలం
డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందంటూ స్థానికుల తీవ్ర ఆందోళన
పారిశుద్ధ్య లోపం, సరిగ్గా సాగని కాలువల నిర్వహణ… pic.twitter.com/vkp7nu3EJx
— RTV (@RTVnewsnetwork) August 20, 2026