Hyderabad Neolithic : హైదరాబాద్ నడిబొడ్డున అద్భుతం చోటు చేసుకుంది. నవనాగరిక ఈ నగరంలో ఒకప్పుడు ఆదిమ మానవులు నడియాడినట్టు ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ఇన్నాళ్లు అడవులు, గుట్టలు ఉన్న మారుమూల ప్రాంతాల్లోనే ఆదిమ మానవులు బ్రతికారని భావించారు. కానీ హైదరాబాద్ వంటి ప్రదేశంలోనూ క్రీ.పూ. 2000 సంవత్సరాల క్రితం అంటే కొత్త రాతి యుగంలో ఇక్కడ ఆదిమ మానవులు సంచరించారని.. ఇక్కడి వాటిని వాడరన్న గుర్తులు దొరికాయి.
కొత్త రాతి యుగం రాతి యుగం చివరిలో హైదరాబాద్ లో ఈ మానవుల జాడ లభ్యమైంది.. ఇది సుమారు 12,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. వీరికాలంలో ” వ్యవసాయం మొదటి పరిణామాలు కనిపించాయి. తరువాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. ఈ కొత్త రాతి యుగం సుమారు 6,500 సంవత్సరాల క్రితం నుండి చాల్‌కోలిథికు పరివర్తన కాలం వరకు కొనసాగింది.

హైదరాబాద్ నగరంలోని ఖాజాగూడ – పుప్పాలగూడ మధ్య ఉన్న ల్యాంకో హిల్స్ సమీపంలోని స్థానికంగా పెద్దగుట్ట అని పిలువబడే భారీ కొండపై ఆదిమ మానవ చరిత్ర బయటపడింది. ఆదిమ మానవుడి కాలానుగుణ నివాస అవశేషాలను పురావస్తు శాస్త్రవేత్త ఇ శివనాగిరెడ్డి తన బృందంతో కలిసి గురువారం కనుగొన్నారు.
నిర్మాణంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఎడమ వైపున ఉన్న పెద్దగుట్టలో విశిష్టమైన రాతి నిర్మాణాల చుట్టూ పురావస్తు శాస్త్రవేత్త సర్వే నిర్వహించారు. సర్వే సమయంలో ఈ బృందం క్రీ.పూ 2000 నాటి నియోలిథిక్ కాలంలో రాతి గొడ్డలిని గ్రౌండింగ్ , పాలిష్ చేయడం ద్వారా ఏర్పడిన నాలుగు ప్రదేశాలను గుర్తించింది.
10 మీటర్ల వ్యాసార్థంలో సహజ రాక్ షెల్టర్‌లకు దగ్గరగా ఉన్న పొడవైన కమ్మీలను కొత్త రాతి యుగంలో ఈ గుట్టలను సీజనల్ క్యాంప్ సైట్‌లుగా ఉపయోగించారని శివనాగిరెడ్డి చెప్పారు.
30 నుండి 25 సెం.మీ పొడవు, 6 నుండి 4 సెం.మీ వెడల్పు మరియు 2 నుండి 3 సెం.మీ లోతు వరకు ఉండే పొడవైన కమ్మీలు, ఆ సమయంలో రాతి పనిముట్లను పదును పెట్టడానికి ఒక చిన్న సమూహం ఉపయోగించి ఉండవచ్చని తెలిపారు. 10 ఎకరాల విస్తీర్ణంలో 15 కంటే ఎక్కువ రాక్ షెల్టర్లు , గుహలు ఇక్కడ కనిపిస్తున్నాయన్నారు. కొన్ని సర్ప హుడ్ ఆకారంలో మరియు కొన్ని శిఖరం ఆకారంలో ఉన్నాయి. ఇవి కొత్త రాత్రి యుగం (నియోలిథిక్) ప్రజలకు వేడి ఎండ వాన సమయంలో సౌకర్యాలు ఇక్కడ కల్పించబడ్డాయని ఆయన చెప్పారు.
రాక్ ఆర్ట్ సైట్, కోకాపేట్ , నియోలిథిక్ సైట్, బీఎన్ఆర్ హిల్స్ వద్ద గతంలో గుర్తించిన సాక్ష్యాలను బట్టి గచ్చిబౌలి-నార్సింగి ఓఆర్ఆర్ కి అవతలి వైపు ఉన్న ప్రదేశం పురావస్తుపరంగా ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉందని , శివనాగిరెడ్డి నిర్ధారణకు వచ్చారు. నియోలిథిక్ , మెగాలిథిక్ (ఇనుప యుగం) కాలంలో హైదరాబాద్ నగర చరిత్రకు సంబంధం ఉందని.. ఇక్కడ అవశేషాలను బట్టి అర్థమవుతోంది. ఇక్కడ చరిత్ర ఉందని నొక్కి చెబుతున్నారు.