Ujjaini Mahankali idol history: ప్రతి ఏడాది ఆషాడ మాసం రాగానే హైదరాబాదులో బోనాల సందడి ప్రారంభమవుతుంది. ఒకప్పుడు హైదరాబాదులోనే కనిపించిన బోనాల జాతర ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కనిపిస్తోంది. మన కోరిక నెరవేర్చినందుకు అమ్మవారికి నైవేద్య రూపంలో ఇచ్చే కానుకనే బోనం అంటారు. ఈ బోనం ఎంతో నిష్టతో తయారుచేసి.. ఉపవాసం ఉండి మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు. ఈ బోనం ఇంటి నుంచి ఆలయానికి తీసుకు వెళ్లే క్రమంలో పోతురాజుల విన్యాసాలు.. డప్పు చప్పులతో దారంతా సందడిగా ఉంటుంది. ఇలా వారానికి ఒక అమ్మవారిని పూజిస్తూ మొత్తం హైదరాబాదులోని అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు. ఇక్కడున్న అమ్మవార్లలో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అసలు మధ్యప్రదేశ్ లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్లోకి ఎలా వచ్చారు? ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు?
Also Read: ఈ ఏడాది పెళ్లిళ్లే పెళ్లిళ్లు.. మంచి ముహూర్తాలు ఏవో తెలుసా?
1800 సంవత్సరంలో హైదరాబాదును ప్లేగు వ్యాధి పట్టిపీడించింది. ఈ సమయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇదే సమయంలో హైదరాబాదులోని కొందరు బ్రిటిష్ సైనికులు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని ప్రాంతానికి బదిలీ చేశారు. అయితే వీరికి తోడుగా హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో ఉజ్జయినిలో ఉన్న అమ్మవారిని ఆ వ్యక్తి కోరుకున్నారు. తమ ప్రాంతంలో ఉన్న ప్లేగు వ్యాధి మాయమైతే మేము కూడా మిమ్మల్ని తీసుకువెళ్లి పూజిస్తామని అమ్మవారికి మాటిచ్చారు. అయితే కొన్నాళ్ల తర్వాత ఆ వ్యక్తి హైదరాబాద్కు తిరిగివచ్చారు. ఆ సమయంలో హైదరాబాదులో ప్లేగు వ్యాధి లేకుండా పోయింది. దీంతో ఎంతో సంతోషించినా వ్యక్తి ఉజ్జయిని నుంచి అమ్మవారిని ఒక చెక్క ప్రతిమలో తీసుకువచ్చారు.
అలా హైదరాబాదులో ప్రస్తుతం ఉన్న ఉజ్జయిని మహంకాళి ఆలయంలో చెక్క ప్రతిమను ప్రతిష్టించారు. ఆ తర్వాత భక్తులు పెరుగుతున్న కొద్దీ.. అమ్మవారికి విగ్రహం ఏర్పాటు చేశారు. మొదట్లో కొందరు మాత్రమే బోనాల ఉత్సవం నిర్వహించేవారు. కానీ భక్తులు తాము అనుకున్న పనులు నెరవేర్చినందుకు చాలామంది ప్రతి ఏటా బోనాలు చేస్తున్నారు.
Also Read: కవిత బోనాల వేడుక: తలసాని స్వాగతం లేదు.. టీ న్యూస్ కవరేజీ లేదు!
లక్ష్మీదేవికి ప్రతిరూపాలైన కొంతమంది అమ్మవాలను సంతాన లక్ష్మి, అష్ట ఐశ్వర్య లక్ష్మి, సరస్వతి అని ఇలా పేర్లతో పిలుస్తారు. అలాగే మహంకాళి అమ్మ వారిని ఆరోగ్య ప్రదాయిని అని పిలుస్తారు. ఎలాంటి అనారోగ్యం ఉన్నా.. ఈ అమ్మవారిని సందర్శించుకుంటే న్యాయం అవుతుందని కొందరి నమ్మకం. అలాగే ప్రతి ఏటా హైదరాబాదులోని గోల్కొండ, లాల్ దర్వాజా, సింహపురి, ఉజ్జయిని వంటి అమ్మ వాళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలను సమర్పిస్తారు. ఈ బోనాల సందర్భంగా భక్తులు ఇక్కడి వారే కాకుండా చుట్టుపక్కల జిల్లాల వారు కూడా తరలివస్తారు. ఈ వేడుకలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. దీంతో బోనాలు పండుగకు ప్రత్యేకంగా సెలవులు కూడా ప్రకటించింది. ఒకప్పుడు హైదరాబాదులోనే బోనాల పండుగ నిర్వహించేవారు. కానీ ఆ తర్వాత తెలంగాణలోని ప్రతి పల్లెలో ఆషాడమాసంలో బోనాల ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇలా ఉజ్జయిని లోని మహంకాళి అమ్మవారు సికింద్రాబాద్ కు తరలివచ్చారు .