HomeతెలంగాణGangula vs Bandi: గంగుల వర్సెస్‌ బండి.. కరీంనగర్లో అగ్గిరాజుకుంది

Gangula vs Bandi: గంగుల వర్సెస్‌ బండి.. కరీంనగర్లో అగ్గిరాజుకుంది

Gangula vs Bandi: కరీంనగర్‌ రాజకీయాల్లో అగ్గి రాజుకుంది. రాజకీయ ప్రత్యర్థులు అయిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌషిక్‌రెడ్డి ప్రెస్‌మీట్‌లో కరీనంగర్‌ సీపీ గౌస్‌ ఆలం, కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. బీజేపీ నాయకులు కరీంనగర్‌లో పాడి కౌషిక్‌రెడ్డిపై దాడికి యత్నించారు. ఆయన తప్పించుకున్నారు. కానీ ఎమ్మెల్యే గంగల కమలాకర్‌ క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది.

వివాదం ఎలా మొదలైంది
ఇటీవల కరీంనగర్‌లోని పీంఎజే ఆభరణాల దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఈ విషయంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌషిక్‌రెడ్డి సీపీ గౌస్‌ఆలంపై సంచలన ఆరోపణలు చేశారు. సీసీ చేతగానితనంతోనే చోరీ జరిగిందన్నారు. రక్షణ కల్పించంలో, దొంగలను పట్టుకోవడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌ కూడా చేష్టలు ఉడిగి చూస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్‌ తంబాకు, డ్రగ్స్‌ కలిపి తీసుకుంటారని ఆరోపించాడు. అందుకే తలపై వెంట్రుకలు ఊడిపోయాయని పేర్కొన్నాడు. కేటీఆర్‌ డ్రగ్‌ టెస్ట్‌కు సిద్ధమని, సంజయ్‌ కూడా సిద్ధం కావాలని డిమాండ్‌ చేశాడు. దీంతో బీజేపీ కార్యకర్తలు పాడి వ్యాఖ్యలపై మండిపడ్డారు. కరీంనగర్‌లో ఉన్న విషయం తెలుసుకుని ఆయనపై దాడికి బయల్దేరారు. తృటిలో ఎమ్మెల్యే తప్పించుకున్నారు.

కార్యాలయం, కారు ధ్వంసం..
ఎమ్మెల్యే కార్యాలయంలోని కారు, కార్యాలయం అద్దాలను బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. దీంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అక్కడకి చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఉద్రిక్తతలు పెరగడంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు.

కౌషిక్‌రెడ్డి అరెస్ట్‌..
అనంతరం పాడి కౌషిక్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్యాంపు కార్యాలయంలోనే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తానే బాధితుడినని, తనపై రౌడీషీటర్లతో దాడి చేయించారని ఆరోపించారు. బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలకు తాను కౌంటర్‌ ఇచ్చానని, ఎవరినీ దుర్భాషలాడలేదని వెల్లడించారు.

సాధారణంగా అధికార ప్రతిపక్షాల మధ్య గొడవలు జరుగుతుంటాయి. కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి కారణంగా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు హైదరాబాదులో దాడి చేశారు. తాజాగా ప్రతిపక్ష పార్టీలైన బిజెపి బిఆర్ఎస్ మధ్య గొడవ మొదలైంది. ఈసారి కరీంనగర్ లో బిజెపి కార్యకర్తలు దాడికి యత్నించారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular