spot_img
HomeతెలంగాణBandi Sanjay: ముస్లింల పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: ముస్లింల పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు అసెంబ్లీ ఎలక్షన్స్ ను తలపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మంత్రులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నవారు పురపాలక ఎన్నికలను అత్యంత సవాల్ గా తీసుకున్నారు. అందువల్లే వారు హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు.

తెలంగాణ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు బండి సంజయ్. ఈయన కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కరీంనగర్ నుంచి తొలిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు బండి సంజయ్. 2024 ఎన్నికల్లో కూడా బండి సంజయ్ కరీంనగర్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంటు స్థానంలో అభివృద్ధి కార్యక్రమాలను ఆయన చేపడుతున్నారు. కేంద్రీయ విద్యాసంస్థల ఏర్పాటు.. మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తున్నారు.

కరీంనగర్ పార్లమెంటు స్థానంలో జరుగుతున్న పురపాలక ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని బండి సంజయ్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్ కార్పొరేషన్ పై కమలం జెండాను ఎగరవేయాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నారు. అందువల్లే విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ ప్రచార క్రతువులో భాగంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

“నేను ముస్లింలకు వ్యతిరేకం కాదు. బిజెపి కూడా ముస్లింలను వ్యతిరేకించదు. కేవలం మేము ఎంఐఎం పార్టీకి మాత్రమే వ్యతిరేకం. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ముస్లింలు కూడా లబ్ధి పొందుతున్నారు. పార్టీలో ముస్లింలకు కూడా కీలకమైన పదవులు ఉన్నాయి. త్రిబుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 రద్దు వంటివి ముస్లింల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ చేశారని” బండి సంజయ్ పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయాలు ఒకసారిగా మారిపోయాయి. కరీంనగర్ పురపాలక ఎన్నికల్లో ముస్లింలకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఆ ఓటు బ్యాంకు ను తమ వైపు మళ్లించుకోవడానికి బండి సంజయ్ ఈ ఎత్తుగడ వేశారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper