Fake Petrol Bunk: అతడు ఓ సీనియర్ జర్నలిస్ట్. పేరుపొందిన టీవీ ఛానల్లో కీలకమైన స్థానంలో ఉన్నాడు. ఓ పార్టీకి అనుకూలంగా (ఇప్పుడున్న మీడియా హౌస్ లన్ని అదే బాపతు కదా) మాట్లాడుతుంటాడు. పైగా కొన్నిసార్లు హద్దులు కూడా దాటుతుంటాడు. అప్పట్లో ఈయనపై ఏపీలో రాజధాని భూములకు సంబంధించి ప్రభుత్వం నుంచి కౌలు తీసుకున్నాడు ఆరోపణలు వినిపించాయి.. అయితే ఈ బడా జర్నలిస్టు గురించి ఇప్పుడు తాజాగా ఒక వార్త మీడియా సర్కిల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది.
హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతంలో నకిలీ ధ్రువపత్రాలతో.. స్థల యజమానికి తెలియకుండా ఆ సీనియర్ జర్నలిస్ట్ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేశారని.. ఇన్ని రోజులపాటు ఫోర్జరీ సంతకాలతో బంక్ నిర్వహిస్తున్నారని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులకు తెలిసింది. దీంతో వారు రంగంలోకి దిగి పెట్రోల్ బంక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్థలానికి చెందిన యజమాని కి చెప్పడంతో అతడు రంగంలోకి దిగాడు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో సదరు సీనియర్ జర్నలిస్టుపై చీటింగ్ కేసు పెట్టాడు. అయితే ఈ ఆక్రమిత స్థలాన్ని ఖాళీ చేయాలని గతంలోనే ఆ సీనియర్ జర్నలిస్ట్ కి అధికారులు చెప్పారు. అయినప్పటికీ తనకు ఉన్న మీడియా అండ తో ఆ సీనియర్ జర్నలిస్ట్ మేనేజ్ చేశాడు. మాదాపూర్ లో అత్యంత ఖరీదైన ప్రాంతంలో.. అది కూడా స్థల యజమానికి తెలియకుండా నకిలీ ధృవపత్రాలతో ఇన్ని రోజులపాటు పెట్రోల్ బంక్ నిర్వహించాడు. భారీగా సంపాదించాడు. రూపాయి పెట్టుబడి లేకుండానే అతడు ఆ స్థాయిలో వ్యాపారం చేయడంతో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు ఆశ్చర్యపోతున్నారు. పెట్రోల్ బంక్ ఏర్పాటుకు సంబంధించి ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేరుపొందిన జర్నలిస్ట్ కావడంతో ఈ వార్తను ప్రచారం కాకుండా తొక్కి పెట్టారని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.
అయితే ఆ జర్నలిస్టు తనకున్న రాజకీయ పలుకుబడితో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులను బురిడీ కొట్టించారని తెలుస్తోంది. సంవత్సరాల పాటు పెట్రోల్ బంక్ నిర్వహించి భారీగా వెనకేసుకున్నారని తెలుస్తోంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు పెట్రోల్ బంక్ ను సీజ్ చేసిన నేపథ్యంలో.. సదరు సీనియర్ జర్నలిస్టు రంగంలోకి దిగి తాను అనుకూలంగా మాట్లాడే పార్టీ పెద్దలను కలిసి.. ఈ సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలుస్తోంది. మరి ఆ పార్టీ నాయకులు ఈ సీనియర్ జర్నలిస్ట్ చెప్పినట్టు సహాయం చేస్తారా? పెట్రోల్ బంక్ తిరిగి ప్రారంభమవుతుందా? అప్పుడు ఆ స్థల యజమాని ఏం చేస్తాడు? కాలం గడిస్తే తప్ప ఈ ప్రశ్నలకు సమాధానం లభించదు.
హైటెక్ సిటీలోని సంధ్య గ్రూప్స్ స్థలంలో అక్రమంగా కొల్లి సౌమ్య, సాంబశివరావు దొంగ లీజ్ అగ్రిమెంటుతో పెట్రోల్ బంక్ నడుపుతున్నట్లు ఫిర్యాదులతో కదిలిన HPCL బృందం.
ఆక్రమిత బంక్‌ను సీజ్ చేస్తున్న అధికారులు. pic.twitter.com/w2Nqhv68IE
— Telugu Scribe (@TeluguScribe) February 21, 2024