Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాడు. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి విన్నర్ అయ్యాడు. సెలబ్రెటీలను సైతం వెనక్కి నెట్టి బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ ఓ సెలబ్రిటీ. అయినప్పటికీ ఎప్పటిలాగే వ్యవసాయం చేసుకుంటూ పొలం పనుల్లో బిజీ అయిపోయాడు. పల్లవి ప్రశాంత్ ఎదిగిన తీరు అద్భుతం. పల్లవి ప్రశాంత్ కి యాక్టింగ్ అంటే చాలా పిచ్చి. సోషల్ మీడియా ద్వారా పాపులర్ కావడానికి పల్లవి ప్రశాంత్ చేయని పని లేదు.
ఆకులు, అలములు తింటూ వీడియోలు చేశాడు. తాను చేసే వ్యవసాయం గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి విషయాలు పంచుకునేవాడు. రైతుబిడ్డగా పల్లవి ప్రశాంత్ పల్లె వీడియోలు వైరల్ అయ్యాయి. అలా పాపులారిటీ సంపాదించిన ప్రశాంత్ బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నాడు. టాస్కులు పరంగా సత్తా చాటుతూ, మంచి ప్రవర్తనతో ప్రేక్షకుల్లో ఆదరణ పెంచుకున్నాడు. పైగా రైతు బిడ్డ ట్యాగ్ బాగా కలిసొచ్చింది. ఊహించని విధంగా టైటిల్ సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు. దీంతో పల్లవి ప్రశాంత్ క్రేజ్ మరింత పెరిగింది.
ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ ఛానల్స్ లో ఫాలోవర్లు అమాంతం పెరిగిపోయారు. భారీగా ఈ క్రమంలో ప్రశాంత్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క యూట్యూబ్ వీడియో చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. పైగా యూట్యూబ్ మానిటైజేషన్ కూడా శివాజీ నే చేయించాడట. అయితే తన అభిమానుల కోసం బిగ్ బాస్ టైటిల్ గెలిచాక ఫస్ట్ యూట్యూబ్ వీడియో ప్రశాంత్ పోస్ట్ చేశాడు. ఇందులో అతను ట్రాక్టర్ లో పత్తి గోతాలు నింపుకుని స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ మార్కెట్ కి వెళ్ళాడు.
ఇక వాటిని మార్కెట్ లో దించాడు. కాటా వేయించి .. అక్కడ ఉన్న వారితో చక్కగా మాట్లాడుతూ సెల్ఫీలు ఇచ్చాడు. ఇక ప్రశాంత్ తండ్రి వచ్చి పత్తి అమ్మగా వచ్చిన డబ్బు తీసుకున్నారు. పక్కనే ఉన్న టీ కొట్టులో ఉన్న మహిళలు ప్రశాంత్ ని ప్రేమగా పలకరించి సెల్ఫీ తీసుకున్నారు. మీరంటే చాలా ఇష్టం .. హౌస్ లో ఉన్నప్పుడు నీకు ఓటు వేసి గెలిపించుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది. ఇక ట్రాక్టర్ లో తండ్రి, తమ్ముడితో కలిసి ఇంటికి బయలుదేరాడు. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంత గొప్ప స్థాయిలో ఉన్నా కూడా నీ వృత్తిని మరిచిపోలేదు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Web Title: Pallavi prashanth got on the tractor to help her father the video went viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com