Homeఎంటర్టైన్మెంట్Kushi 25 years anniversary: 'ఖుషి' చిత్రానికి 25 ఏళ్ళు.. 10 రూపాయిల టికెట్ రేట్స్...

Kushi 25 years anniversary: ‘ఖుషి’ చిత్రానికి 25 ఏళ్ళు.. 10 రూపాయిల టికెట్ రేట్స్ తో ఈ సినిమా సాధించిన వసూళ్లు ఎంతో తెలుసా..

Kushi 25 years anniversary: టాలీవుడ్ హిస్టరీ లో ఆల్ టైం క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న అతి కొద్దీ లవ్ సిరీస్ లో ఒకటి ‘ఖుషి’. అప్పటికే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సుస్వాగతం , తొలిప్రేమ , తమ్ముడు , బద్రి వంటి సూపర్ హిట్ చిత్రాలతో యూత్ ఆడియన్స్ లో తిరుగులేని ఫ్యుయాం ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఎంతలా అంటే, ఆంధ్ర ప్రదేశ్ యూత్ అనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని […]

Kushi 25 years anniversary: టాలీవుడ్ హిస్టరీ లో ఆల్ టైం క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న అతి కొద్దీ లవ్ సిరీస్ లో ఒకటి ‘ఖుషి’. అప్పటికే పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సుస్వాగతం , తొలిప్రేమ , తమ్ముడు , బద్రి వంటి సూపర్ హిట్ చిత్రాలతో యూత్ ఆడియన్స్ లో తిరుగులేని ఫ్యుయాం ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఎంతలా అంటే, ఆంధ్ర ప్రదేశ్ యూత్ అనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఫిక్స్ అయిపోయేవారు . అలాంటి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయిన సమయంలో వచ్చింది ఈ ఖుషి. ఈ సినిమా అప్పట్లో పెద్ద ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ దాదాపుగా టాలీవుడ్ నెంబర్ 1 సింహాసనం పై కూర్చునే స్థాయికి ఎదిగిపోయాడు. ఆరోజుల్లో యువత మొత్తం ఖుషి లో పవన్ కళ్యాణ్ స్టైలింగ్ ని అనుసరించేవారు. గ్యాప్ టీ షర్ట్స్, సైడ్ కట్ బ్యాగ్స్ వంటివి ఆరోజుల్లో అంత పాపులర్ అవ్వడానికి కారణం ఖుషి సినిమానే.

ఈ చిత్రానికి ఎస్ జె సూర్య దర్శకత్వం వహించాడు. ముందుగా ఈ సినిమాని ఏక కాలంలో తెలుగు , తమిళ భాషల్లో చిత్రీకరించాలని అనుకున్నారు. తమిళ్ లో విజయ్ హీరో. అయితే పవన్ కళ్యాణ్ ఆ సమయం లో ‘బద్రి’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉండడం వల్ల, ముందుగా తమిళ్ లో ప్రారంభమై , షూటింగ్ పూర్తి చేసుకొని అక్కడ విడుదలైంది. విజయ్ కెరీర్ హిట్ గా నిల్చింది కానీ, వేరే లెవెల్ హిట్ అయితే కాదు. అక్కడ విడుదలైన కొన్నిరోజులు తెలుగు లో షూట్ చేశారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మొదట్లో ఆడియన్స్ నుండి ఫ్లాప్ టాక్ వచ్చింది. వారం రోజుల తర్వాత టాక్ పాజిటివ్ గా మారి ఇండస్ట్రీ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. ఈ చిత్రం లోని ప్రతీ పాట ఒక సెన్సేషన్.

ఇప్పటి యూత్ ఆడియన్స్ కి కూడా ఈ పాటలంటే పిచ్చి. ఈ చిత్రం లోనే పాటలన్నిటికీ పవన్ కళ్యాణే స్వయంగా కొరియోగ్రఫీ చేసాడు. అంతే కాకుండా, క్లైమాక్స్ మార్పు తో పాటు , కొన్ని సన్నివేశాలకు పవన్ కళ్యాణే రచయితగా వ్యవహరించడమే కాకుండా, దర్శకత్వం కూడా వహించాడు. ఆయన చేసిన మార్పులు చేర్పులు కారణంగానే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యిందని, స్వయంగా డైరెక్టర్ ఎస్ జె సూర్య చెప్పుకొచ్చింది. ఆరోజుల్లో టికెట్ రేట్స్ 10 నుండి 25 రూపాయిల వరకు ఉండేది. ఆ రేట్స్ తోనే ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. దాదాపుగా 72 సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, రీ రిలీజ్ లో కూడా ఎన్నో సెన్సేషనల్ రికార్డ్స్ ని అప్పట్లో క్రియేట్. ఇక 2022 వ సంవత్సరం లో ఈ చిత్రాన్ని 4K కి మార్చి గ్రాండ్ గా రీ రిలీజ్ చేశారు. రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది. తక్కువ థియేటర్స్ లో విడుదల అయ్యినప్పటికీ కూడా ఈ చిత్రానికి దాదాపుగా 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper