spot_img
HomeతెలంగాణBadangpet Municipality Corruption: పని చేయండని కొలువిస్తే.. 122 కోట్లు కొట్టేశారు..

Badangpet Municipality Corruption: పని చేయండని కొలువిస్తే.. 122 కోట్లు కొట్టేశారు..

Badangpet Municipality Corruption: ఉన్నతమైన హోదా.. నెలకు లక్షలలో జీతం.. వాటికి మించిన సౌకర్యాలు.. ఇంకా రకరకాల సౌలభ్యాలు.. ఇన్ని ఉన్నప్పటికీ కూడా వారిలో ఆశ చావలేదు. ఇంకా సంపాదించాలని.. మరింత వెనకేయాలని అనుకున్నారు. కానీ చివరికి దొరికిపోయారు.

హైదరాబాదు నగర పరిధిలోని బడంగ్ పేట మున్సిపాలిటీ కార్యాలయం ఉంది. ఇది శివారు ప్రాంతం కావడంతో భూ లావాదేవీలు.. ఇతర వ్యవహారాలు భారీగా సాగుతుంటాయి. ఇక్కడ భూముల ధర కూడా విపరీతంగా ఉంది. అందువల్ల తెర వెనుక వ్యవహారాలు చాలా జరిగిపోయాయి. ముఖ్యంగా బడంగ్పేట్ మున్సిపాలిలో పనిచేసే కొంతమంది అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాశారు. ప్రభుత్వానికి సొమ్ము వెళ్లకుండా అడ్డుకట్ట వేశారు. ఆ సొమ్ముతో తమ జేబులు నింపుకున్నారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా 122 కోట్లు నొక్కేశారు.

ప్రభుత్వ ఆదాయంలో తేడా రావడం.. ప్రభుత్వ ఖాతాకు డబ్బులు జమ కాకపోవడంతో ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. మరో మాటకు తావు లేకుండా విజిలెన్స్ విచారణకు అధికారులు ఉపక్రమించారు. దీంతో బడంగ్ పేట మున్సిపాలిటీలో అంతర్గత విచారణ కొనసాగించారు.

విజిలెన్స్ విచారణలో బడంగ్పేట్ మున్సిపాలిటీలో జరిగిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. మొత్తంగా 122 కోట్ల అవినీతి జరిగిందని అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో పదిమంది అధికారులకు పాత్ర ఉందని గుర్తించారు. డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న సరస్వతి.. మరో తొమ్మిది మంది అధికారులు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారు. ఆస్తి పన్ను నుంచి మొదలు పెడితే.. వెంచర్లకు అనుమతులు వరకు ఇలా అన్ని విషయాలలో అవినీతికి పాల్పడ్డారు. మొత్తంగా 122 కోట్లను నొక్కేశారు. ప్రాథమిక చర్యగా పదిమంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం.. తదుపరి చర్యలను తీసుకోవడానికి సిద్ధమవుతోంది.

ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మున్సిపాలిటీలో అవినీతి వ్యవహారం జోరుగా సాగింది. సిబ్బంది అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడ్డారు. ఏసీబీ అధికారులకు ఈ విషయం తెలియడంతో రంగంలోకి దిగారు. తనిఖీలు చేపట్టారు. అవినీతికి పాల్పడిన సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించగా.. బడంగ్ పేట మున్సిపాలిటీ అయితే అవినీతిలో రికార్డు సృష్టించింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన నేపథ్యంలో.. సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper