Homeక్రీడలుక్రికెట్‌CSK Vs RCB Match Analysis 2026: ఇది ధోని సీఎస్కే కాదు.. బెంగళూరు ను...

CSK Vs RCB Match Analysis 2026: ఇది ధోని సీఎస్కే కాదు.. బెంగళూరు ను ఓడించాలంటే చాలా జరగాలి

CSK Vs RCB Match Analysis 2026: ఐపీఎల్ లో భాగంగా బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం తలపడబోతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య భీకరమైన పోటీ జరుగుతుందని అంచనాలు వినిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ధోని నాయకుడిగా ఉన్నప్పుడు.. చెన్నై జట్టు బెంగళూరుకు చుక్కలు చూపించేది. 2024లో డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. తొలి మ్యాచ్ బెంగళూరు తో ఆడింది. నాటి మ్యాచ్లో […]

CSK Vs RCB Match Analysis 2026: ఐపీఎల్ లో భాగంగా బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం తలపడబోతున్నాయి. ఈ రెండు జట్ల మధ్య భీకరమైన పోటీ జరుగుతుందని అంచనాలు వినిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి ఉండకపోవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి ధోని నాయకుడిగా ఉన్నప్పుడు.. చెన్నై జట్టు బెంగళూరుకు చుక్కలు చూపించేది. 2024లో డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. తొలి మ్యాచ్ బెంగళూరు తో ఆడింది. నాటి మ్యాచ్లో బెంగళూరును ఓడించింది.. వాస్తవానికి ధోని ఉన్నప్పుడు చెన్నై జట్టు బలంగా ఉండేది. నాయకుడిగా అతడు అద్భుతమైన వ్యూహాలను.. ప్రణాళికలను అమలు చేసేవాడు. వాటిలో చిక్కుకుని బెంగళూరు జట్టు కొట్టుకునేది.

ఇప్పుడు చెన్నైలో ధోని లేడు. గైక్వాడ్ సత్తా చూపించలేకపోతున్నాడు. ఉన్న ప్లేయర్లలో ఎవరు ఎప్పుడు ఎలా ఆడుతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. సంజు ఉన్నాడు అంటే ఉన్నాడు అనుకోవాలి.. ఆయుష్ మాత్రే ప్రతిఘటిస్తున్నాడు. కాకపోతే అతడు ఒక్కడే జట్టు భారాన్ని ఎలా మోయగలడు.. ఇక మిగతా ప్లేయర్లు బ్యాట్ ద్వారా సత్తా చూపించాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చేసింది. ఎందుకంటే చెన్నై జట్టు వరుసగా ఓటములు ఎదుర్కొంది. పాయింట్ల పట్టికలో దిగువ స్థానంలో కొనసాగుతోంది. గౌహతిలో రాజస్థాన్ చేతిలో దారుణమైన పరాజయం పాలైంది. సొంత మైదానంలో పంజాబ్ చేతిలో దారుణమైన ఓటమిని మూట కట్టుకుంది .

బెంగళూరు తో చెన్నై తలపడే మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ స్టేడియంలో ఇప్పటికే బెంగళూరు హైదరాబాద్ జట్టుపై గెలిచింది. గత సీజన్లో హోమ్ గ్రౌండ్లో మూడు ఓటములను ఎదుర్కొన్న బెంగళూరు.. ఈసారి మాత్రం విజయంతో మొదలుపెట్టింది. బెంగళూరులో విరాట్ నుంచి మొదలు పెడితే పాటిదార్ వరకు అందరూ సూపర్ ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్లో డఫీ సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఆర్ సి బి గత సీజన్లో చెన్నై జట్టును మూడుసార్లు ఓడించింది. తొలి మ్యాచ్లో 27 పరుగులు.. రెండో మ్యాచ్లో 20 పరుగులు.. మూడో మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో మట్టి కరిపించింది. హ్యాట్రిక్ ఓటములతో జట్టు డీలా పడిపోగా.. బెంగళూరు జట్టు ఉత్సాహంతో కనిపిస్తోంది.

బంతి నుంచి స్వింగ్ రాబడితే బెంగళూరు మైదానంలో వికెట్లు తీయడం ఈజీ అవుతుంది. కానీ చెన్నై బౌలర్లకు ఆ సామర్థ్యం ఉందా అనేదే ఇక్కడ ప్రశ్న.. ఇక బ్యాటింగ్లో కూడా చెన్నై జట్టు సమర్థతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ బ్యాటింగ్లో.. బౌలింగ్లో చేతులెత్తేస్తే.. చిన్న స్వామి స్టేడియంలో కూడా ఓటమిని మూటకట్టుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే పాయింట్ల పట్టికలో చెన్నై మరింత అధమ స్థానంలో కూరుకుపోవడం ఖాయం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper