Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్

ఆసుపత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్

సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు  ఇదివరకే ప్రకటించారు. ఆదివారం ఉదయం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ ప్రకటించారు. వైద్య పరీక్షలన్నీ నార్మల్ గానే ఉన్నాయన్నారు. నిన్నటికంటే ఈరోజు ఆరోగ్యం మరింత మెరుగైందని, ప్రస్తుతం బీపీ కంట్రోల్ లోనే ఉందని వైద్యులు తెలిపారు. ఈనెల 25న హైబీపీ తో రజనీ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అంతకుముందు ఆయన ‘అన్నాత్తే’ షూటింగ్ […]

సినీ నటుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు  ఇదివరకే ప్రకటించారు. ఆదివారం ఉదయం అపోలో వైద్యులు హెల్త్ బులిటెన్ ప్రకటించారు. వైద్య పరీక్షలన్నీ నార్మల్ గానే ఉన్నాయన్నారు. నిన్నటికంటే ఈరోజు ఆరోగ్యం మరింత మెరుగైందని, ప్రస్తుతం బీపీ కంట్రోల్ లోనే ఉందని వైద్యులు తెలిపారు. ఈనెల 25న హైబీపీ తో రజనీ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అంతకుముందు ఆయన ‘అన్నాత్తే’ షూటింగ్ లో పాల్గొన్నారు. చిత్రం యూనిట్ లో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత రజనీకి హైబీపీ రావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే తాజాగా అపోలో వైద్యులు రజనీని డిశ్చార్జి చేయడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper