Urine : మానవ శరీరంలో 60 శాతం నీరు ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది తగ్గినప్పుడు దాహం వేస్తుంది. కానీ కొందరు దాహం వేసిన వాటర్ ను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడరు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వేసవి కాలంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వల్ల చెమట రూపంలో శరీరం నుంచి నీరు బయటకు వెళ్తుంది. అయితే మిగతా కాలంలో మాత్రం శరీరంలోని మీరు బయటకు వెళ్లాలంటే మూత్రనాళాలే ప్రధాన దారి. అయితే ఈ మూత్ర నామాలు సరిగ్గా ఉంటేనే శరీరంలో ఎప్పటికప్పుడు నీటి ప్రక్రియ సక్రమంగా సాగుతుంది. కొత్తనీరు వచ్చి మలినమైన నీరు బయటకు వెళ్తుంది. కానీ ఈ మూత్రణాలలో సమస్యలు ఉంటే ఈ ప్రక్రియ జరగదు. దీంతో మూత్రం పోసినప్పుడు నురగ రావడం.. లేదా మంట లేవడం వంటి సమస్యలు వస్తాయి. ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అయితే మూత్రంలో నురగ రావడానికి లేదా మంట రావడానికి అసలు కారణం ఏంటి?
కొందరు మూత్రం పోస్తుంటే నురగ వస్తుంది. అయితే ఇది మరీ ఎక్కువగా వస్తే వెంటనే తమకు షుగర్ కంట్రోల్ తప్పిందని ఆందోళన చెందుతారు. కానీ మూత్రం నురగ రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మూత్రంలో శుద్ధ బయటకు వెళ్తుంటే నురగ వస్తుంది. ఈ శుద్ధ అనేది బయటకు వెళ్తే ఎటువంటి సమస్య ఉండదు. కానీ మూత్రంలో నురగ వస్తుందని తెలియగానే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. వీలైతే వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఎందుకంటే మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్న.. లేదా మధుమేహం వచ్చే అవకాశాలున్నట్టు తెలిసినా దాని లక్షణం ఇలానే ఉంటుంది. మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్ తీసుకుంటూ ఉండాలి. దీనిని నిర్లక్ష్యంగా చేస్తే కిడ్నీపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
Also Read : యూరిన్ స్మెల్ ఎందుకు వస్తుంది? ఈ సమస్య ఉంటే మీరు లైట్ తీసుకుంటున్నారా? దారుణమైన వ్యాధులకు సంకేతం కావచ్చు..
అలాగే మధుమేహం, అధిక బీపీ ఉన్నవారికి ఇలాంటి లక్షణాలు ఉండవచ్చు. అయితే ఇవి వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. తమ పూర్వీకుల్లో ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే.. ఇలాంటి లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే ఈ సమస్య రకరకాలుగా ఉన్నందున వైద్య పరీక్షల ద్వారా నిర్ధారణ చేసుకున్న తర్వాతే మెడిసిన్ తీసుకునే ప్రయత్నం చేయాలి. మూత్రంలో నురగరావడం అందరికీ ఒకేలాగా ఉంటుందని అనుకోలేం. వారి శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్ల ద్వారా కూడా వస్తూ ఉంటుంది.
అయితే ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. వేసవి కాలంలో ఎక్కువగా నీరు తీసుకుంటూ ఉండాలి. అలాగే ప్రాసెస్ లేదా ఉష్ణోగ్రతను ఎక్కువగా కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మద్యం అలవాటు ఉంటే వెంటనే మానేసుకోవాలి. ఎందుకంటే మద్యం ఎక్కువగా తాగడం వల్ల ఇలాంటి ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.