Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్కిష్టారాంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలి: రాజగోపాల్‌రెడ్డి

కిష్టారాంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకోవాలి: రాజగోపాల్‌రెడ్డి

నల్లగొండ కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో భూ నిర్వాసితులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. భూసేకరణలో జాప్యం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో గత ఆరేళ్లుగా రైతులు తమ బాధలు చెబుతూనే ఉన్నారన్నారు. కాంట్రాక్టర్లకు మద్దతుగా పోలీసులను పెట్టి పనిచేయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కాళేశ్వరానికి ఓ న్యాయం, తమ ప్రాంత ప్రాజెక్టులకు ఓ న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే కిష్టారాంపల్లి ప్రాజెక్టు […]

నల్లగొండ కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో భూ నిర్వాసితులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. భూసేకరణలో జాప్యం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ విషయంలో గత ఆరేళ్లుగా రైతులు తమ బాధలు చెబుతూనే ఉన్నారన్నారు. కాంట్రాక్టర్లకు మద్దతుగా పోలీసులను పెట్టి పనిచేయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. కాళేశ్వరానికి ఓ న్యాయం, తమ ప్రాంత ప్రాజెక్టులకు ఓ న్యాయమా అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే కిష్టారాంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజల కోసం నిరాహారదీక్ష చేసైనా సరే సీఎం కళ్లు తెరిపిస్తామని ఆయన ప్రకటించారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper