
సీఎం కేసీఆర్ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిందంతా డ్రామానే అని సీఎల్పీనేత భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. కేసీఆర్ ముసుగు నిన్నటితో తొలగిపోయిందని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం బలమైన వ్యవస్థలను కూల్చే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ఐకేపీ వ్యవస్థను మూసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. పీఏసీఎస్‌ను మూసేయలని చూస్తున్నారన్నారు. రైతులకు మద్దతు ధర రాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.