murderd
తన తమ్ముడిపై దాడి చేయడానికి వచ్చిన కొందరిని అడ్డుకున్నందుకు వారు అన్నను హత్య చేసిన సంఘటన హైదరాబాద్‌లోని గోషామహల్‌లో చోటు చేసుకుంది. గోషామహల్ చంద్రకిరణ్ బస్తీకి చెందిన కొండ్ర మధుకు 17 ఏళ్ల ఓ తమ్ముడు ఉన్నాడు. అదే బస్తికి చెందిన ప్రకాశ్ కూతురిని మధు తమ్ముడు ప్రేమించసాగాడు. ఈ విషయం ప్రకాశ్‌కు తెలియడంతో సదరు యువకుడిని హెచ్చరించాడు. అయినా వినకపోవడంతో గురువారం అర్ధరాత్రి ప్రకాశ్‌తో పాటు శంకర్, కుమార్ అనే వ్యక్తులు మధు తమ్ముడి ఇంటికి వచ్చి దాడికి యత్నించారు. పక్క గదిలో ఉన్న మధు లేచి వారిని అడ్డుకోబోయారు. ఈ తరుణంలో మధుపై ఆ ముగ్గురు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు షాహినాయత్‌గంజ్ సీఐ చాంద్‌బాషా తెలిపారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Elder brother murdered when save his brother
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com