Vodafone TV: ఇండియాలో టెలికాం వ్యవహారాలలో ఒకప్పుడు వోడాఫోన్ కంపెనీకి తిరుగు ఉండేది కాదు.. అంతకుముందు ఈ కంపెనీ హచ్ అనే టెలికాం సంస్థను కొనుగోలు చేసింది. ఆ తర్వాత మనదేశంలో కార్యకలాపాలు ప్రారంభించింది.
ఇంగ్లాండ్ దేశంలో వోడాఫోన్ కంపెనీకి బలమైన నెట్వర్క్ ఉంది. ఇండియాలో ఐడియాతో జత కట్టిన తర్వాత వోడాఫోన్ టెలికాం కార్యకలాపాలు కొద్ది పరిధిలో మాత్రమే జరుగుతున్నాయి. ఈ కంపెనీ టెలికాం వ్యాపారాన్ని మొత్తం జియో లాగేసుకుంది. వోడాఫోన్ కు ఇంగ్లాండ్ దేశంలో బలమైన వ్యాపారం కొనసాగుతోంది.
కేవలం టెలికం వ్యాపారానికి మాత్రమే పరిమితం కాకుండా.. అంతకుమించి అనే స్థాయిలో బిజినెస్ మొదలు పెట్టింది వోడాఫోన్. మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తూ టీవీ వ్యాపారంలోకి అడుగు పెట్టింది. కాకపోతే రొటీన్ టీవీ కాకుండా.. మార్కెట్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించడానికి వోడాఫోన్ అద్భుతమైన పరిశోధనలు చేసి.. స్మార్ట్ యూజర్లకు అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వబోతోంది. వోడాఫోన్ టీవీ పేరుతో అక్టోబర్ నెలలో వోడాఫోన్ కంపెనీ దీనిని విడుదల చేయబోతోంది.
సాధారణంగా టీవీ అనేది డిష్ లేదా యాంటీనా ఆధారంగా పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే వోడాఫోన్ కంపెనీ కేవలం బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ఆల్ ఇన్ వన్ టీవీని రూపొందించింది. ఇందులో 4k టీవీ తో పాటు థియేటర్ లాంటి ఆడియో అనుభూతి లభిస్తుంది.
ఇందులో ఉన్న ఫీచర్లు
4K ultra HD Dolby vision: అత్యుత్తమ పిక్చర్ క్వాలిటీ కోసం.. 4K రిజల్యూషన్, డాల్ విజన్ కు ఇది సపోర్ట్ చేస్తూ ఉంటుంది.
Dolby atmos: థియేటర్ స్థాయిలో లీనమయ్యే ఆడియో అనుభూతిని అందించేందుకు ఇందులో డాల్బీ అటామాస్ సౌండ్ సిస్టం ఉంది.
Hardware and gaming
పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్.. ఈ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ 3 జిబి రామ్, 32 జిబి స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. దీనివల్ల యాప్స్.. ఇతర గేమింగ్ స్మూత్ గా కొనసాగుతుంటాయి.
క్లౌడ్ గేమింగ్… ఇటువంటి ఖర్చు లేకుండానే బ్లూటూత్ కంట్రోలర్ ద్వారా స్మార్ట్ఫోన్ ఉపయోగించి ఆడుకునే విధంగా 300 కంటే ఎక్కువ క్లౌడ్ గేమ్స్ ఇందులో ఉన్నాయి.
కంటెంట్ అండ్ ఎంటర్న్మెంట్
ఇన్బిల్ట్ స్ట్రీమింగ్ యాప్స్.. యాడ్స్తో కూడిన నెట్ ఫ్లిక్స్ స్టాండర్డ్.. హెచ్బిఓ మాక్స్ సబ్స్క్రిప్షన్లు ఇందులో ఉన్నాయి..
ప్రీలీ సపోర్ట్.. యాంటిన లేకుండానే బిబిసి, ఐటివి ఛానల్ ఫోర్, ఛానల్ ఫైవ్ వంటి ప్రముఖ నెట్వర్క్ నుంచి 70కి పైగా లైవ్ టీవీ చానల్స్ ఉచితంగా చూసే అవకాశం ఉంది.
స్మార్ట్ కంట్రోల్.. వాయిస్ కంట్రోల్ ద్వారా సులువుగా ఆపరేట్ చేయడానికి గూగుల్ అసిస్టెంట్.. ఏఐ ఆధారిత స్మార్ట్ సెర్చ్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
గూగుల్ ప్లే స్టోర్.. వేలాది యాప్స్.. గేమింగ్ అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవడానికి సులువైన అవకాశం ఉంది.
5జి బ్రాడ్బ్యాండ్ లేదా మొబైల్ ప్లాన్ ఉన్న వినియోగదారులకు ఈ టీవీ ఎంతగానో ఉపయోగపడుతుందని వోడాఫోన్ చెబుతోంది. అయితే దీని ధర గురించి వోడాఫోన్ ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు.