Aditya Jamwal: మార్కులు మన విజ్ఞానానికి కొలమానం కాదు. మన ప్రతిభకు గీటు రాయి కాదు. మార్కులు కేవలం అంకెలు మాత్రమే. ఈ విషయాన్ని అనేకమంది అనేక సందర్భాల్లో నిరూపించారు. ఆయన ఇప్పటికీ నేటికీ చాలామంది తల్లిదండ్రులు మారరు. మారే ప్రయత్నం కూడా చేయరు. కేవలం మార్కులు మాత్రమే కొలమానం అన్నట్టుగా తమ పిల్లల మీద ఒత్తిడి పెడుతుంటారు. ఇక కార్పొరేట్ కాలేజీలు.. పాఠశాలలు ఏ విధంగా విద్యార్థుల మీద ఒత్తిడి పెడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
మార్కులు దేనికి పనికి రావని.. జస్ట్ అవి నెంబర్లు మాత్రమేనని.. వాటి వల్ల పెద్దగా ఉపయోగం కూడా ఉండదని ఇతడు నిరూపించాడు. మార్కుల వల్ల జరిగే ప్రయోజనం ఉండదని.. మార్కులతో సాధించేది ఏదీ లేదని ఇతడు చాటిచెబుతున్నాడు. మార్కుల కంటే జ్ఞానాన్ని పెంచుకోవడం ఉత్తమమని.. దానివల్ల ఎన్నో సాధించవచ్చు అని ఇతడు నిరూపించాడు.. విజయం అంటే ఇలా ఉంటుందని.. విజయం సాధిస్తే ప్రపంచం ఇలా చూస్తుందని అతడు నిరూపిస్తున్నాడు.
అతడి పేరు ఆదిత్య జంవాల్.. చిన్నప్పటినుంచి చదువులో కాస్త వెనుకబాటే. అతి కష్టం మీద డిగ్రీ దాకా లాక్కుని వచ్చాడు. డిగ్రీలో కూడా 6.8 సిజిపిఏ సాధించాడు.. పెద్దగా ఇతడికి కెరియర్ మీద ఫోకసింగ్ లేదు. ఈ నేపథ్యంలో అతడు ఒక స్నేహితుడు చెప్తే తన స్కిల్స్ మీద ఫోకస్ పెట్టాడు. తన లోపాలను అధిగమించే ప్రయత్నం చేశాడు. అన్ని రకాలుగా తనను తాను కొత్తగా సిద్ధం చేసుకున్నాడు. ఎక్కడైతే తాను వెనుక పడుతున్నాడో.. అక్కడే తనను తాను కొత్తగా రూపొందించుకున్నాడు. స్టడీ స్కిల్స్ పెంచుకున్నాడు. సాఫ్ట్ స్కిల్స్ అప్డేట్ చేసుకున్నాడు. ఇంగ్లీష్ మీద పట్టు పెంచుకున్నాడు.. అంతేకాదు ఐటీ రంగానికి కావలసిన అన్ని అర్హతలు సాధించాడు. దీంతో మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగానికి వెళ్ళాడు.. అక్కడ ఇంటర్వ్యూ ఈజీ గానే పూర్తి చేశాడు. అతడి సామర్థ్యానికి మైక్రోసాఫ్ట్ యాజమాన్యం మెచ్చింది. ఇంకేముంది 32 లక్షల ప్యాకేజీ ఖరారు చేసింది. దీంతో ఆదిత్య ఆనందానికి అవధులు లేవు.
9.2 సిజిపిఏ తో బీటెక్ పూర్తి చేసిన ఒక యువకుడు కేవలం 6 లక్షల ప్యాకేజీ మాత్రమే సొంతం చేసుకోవడం విశేషం. పైగా అతడు ఇంటర్వ్యూలను సరిగ్గా ఫినిష్ చేయలేకపోయాడు. ఆశించిన స్థాయిలో సాఫ్ట్ స్కిల్స్ పెంచుకోలేకపోయాడు. స్టడీ స్కిల్స్ విషయంలో కూడా అతడు అలాంటి ధోరణి ప్రదర్శించాడు. దీంతో నామమాత్రపు వేతనంతో పనిచేస్తున్నాడు. అందుకే మార్కులు కొలమానం కాదు. జస్ట్ అవి అంకెలు మాత్రమేనని ఆదిత్య నిరూపించాడు.