spot_img
Homeబిజినెస్Latest Smartphones 2026: మార్కెట్లోకి కొత్తగా వచ్చాయి.. ఈ స్మార్ట్ ఫోన్ల ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Latest Smartphones 2026: మార్కెట్లోకి కొత్తగా వచ్చాయి.. ఈ స్మార్ట్ ఫోన్ల ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

Latest Smartphones 2026: మనుషుల జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగం అయిపోయింది. స్మార్ట్ ఫోన్ ఆధారంగా అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్లలో ఫీచర్లను ఎక్కువగా యూజర్లు కోరుకుంటున్నారు. అటువంటి వాటినే కొనుగోలు చేస్తున్నారు. కంపెనీలు కూడా యూజర్ల ఇష్టాన్ని గౌరవించి ఎక్కువ ఫీచర్లను యాడ్ చేస్తున్నాయి. అందువల్లే ప్రతి ఏడాది కొత్త మోడల్స్ ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నాయి.

స్మార్ట్ ఫోన్ తయారీలో అనేక కంపెనీలు ఉన్నప్పటికీ.. కొన్ని కంపెనీల బ్రాండ్లు మాత్రమే విపరీతంగా అమ్ముడుపోతుంటాయి. ఆ కంపెనీలు మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా కొత్త కొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తుంటాయి. ఈ ఏడాది ఇప్పటికే చాలా రకాల మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి . మరీ ముఖ్యంగా మే నెలలో అనేక రకాల మోడల్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఇంకా అనేక రకాల మోడల్స్ లైన్లో ఉన్నాయి.

ప్రముఖ కంపెనీలు వివో, ఒప్పో, వన్ ప్లస్ కంపెనీలు అనేక రకాల మోడల్స్ ను ఈ నెలలో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా మనదేశంలో పేరుపొందిన కంపెనీలు కొత్త మోడల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి..

Vivo x300

Vivo x300 సిరీస్లో రెండు కొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేయబోతోంది. Vivo x300 ultra, Vivo x300 FE పేరుతో ఈనెల 6న విడుదల చేయబోతోంది. ఈ మోడల్స్ లో కెమెరా ప్రధానంగా ఉంటుందని వివో కంపెనీ చెబుతోంది.. Vivo x300 ultra లో (200 megapixel camera+ 50 megapixel Ultra wide angle sensor, 200 megapixel periscope tele photo lens) అద్భుతమైన ఫీచర్లు ఉంటాయని వివో కంపెనీ చెబుతోంది. దీని ధర ఏకంగా లక్ష వరకు ఉండవచ్చని తెలుస్తోంది. దీని డిజైన్ మొత్తం ఐఫోన్ మాదిరిగా ఉంది. Vivo x300 FE స్మార్ట్ ఫోన్ ను కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. దీని ధర 60 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు ఫోన్లు కూడా 6500 ఎం ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్లోకి వస్తాయి.

OPPO

OPPO find X9 ultra, OPPO Find X9s పేరుతో వీటిని ఒప్పో కంపెనీ తీసుకొస్తుంది.. ఫైండ్ ఎక్స్ నైన్ ఆల్ట్రాలో ప్రధానంగా ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. డిస్ప్లే కూడా అదే స్థాయిలో ఉంటుందని ఈ కంపెనీ చెబుతోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం ఇందులో ఉంది.. చైనా దేశంలో ఒప్పో కంపెనీ ఈ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. మనదేశంలో దాదాపు అదే ఫీచర్లతో విడుదల చేస్తోంది.. 200 megapixel main camera, megapixel ultrawide angle camera, 200 megapixel Omni vision tele photo camera, 50 megapixel front camera వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 7050 ఎం ఏ హెచ్ బ్యాటరీ ఇందులో ఉంది. ఒప్పో ఫైండ్ ఎక్స్ 9 ఎస్ ఫోన్ 7025 ఎం ఏ హెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీతో వస్తుంది.

Oneplus Nord series

Oneplus Nord series లో మెడ్ రేంజ్ సెగ్మెంట్ లో One plus Note CE 6, CE 6 Lite పేరుతో రెండు కొత్త సిరీస్ ఫోన్లను మే ఏడో తేదీన మార్కెట్లోకి విడుదల చేయబోతోంది.. ఇవి 8000 ఎం ఏ హెచ్ బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్లోకి విడుదలవుతున్నాయి.. వీటిలో నార్డ్ సీఈ 6 ధర 30 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. సీఈ 6 లైట్ ధర మిడిల్ క్లాస్ యూజర్లకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.. వన్ ప్లస్ 15 ఎస్ మాత్రం ప్రీమియం రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. ఇందులో బ్యాటరీ లైఫ్, డిస్ప్లే, పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటాయని సమాచారం. 60 వేలకు పైగా ధర ఉండే ఈ ఫోన్ లో 7500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది.

Infinix

ఇది కూడా చైనాకు సంబంధించిన కంపెనీ.. ఇన్ఫినిక్స్ జి టి 50 ప్రో పేరుతో ఈ మోడల్ మార్కెట్లోకి వస్తోంది.. ఇది బడ్జెట్ సెగ్మెంట్లో ఉంటుంది. గేమర్లకు అనుకూలంగా ఉంటుంది. హై రీ ప్రెష్ రేట్, డిస్ ప్లే ఇందులో బాగుంటాయని ఆ కంపెనీ చెబుతోంది. ధర కూడా 30000 లోపు ఉంటుందని సమాచారం..

Xiaomi , IQ OO, realme, Motorola

Xiaomi కంపెనీ నుంచి 17t, IQ OO Z11lite, realme నుంచి రియల్ మీ పి ఫోర్ ఆర్, మోటరోలా నుంచి మోటో ఆర్ ఎ జెడ్ ఆర్ 70 ఆల్ట్రా, ఆర్ ఎ జెడ్ ఆర్ 70 పేరుతో ఫోన్లను విడుదల చేయబోతోంది.. అయితే ఈ ఫోన్లు త్వరలోనే విడుదలవుతాయి. తేదీలు ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper