Best Camera Phones : స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు కెమెరాకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రూ.30,000లోపు బడ్జెట్‌లోనే అధునాతన కెమెరా ఫీచర్లతో పలు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. 200MP కెమెరా నుంచి టెలిఫొటో లెన్స్, OIS వరకు ఎన్నో ఫీచర్లు ఈ సెగ్మెంట్‌లో లభిస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ కెమెరా ఫోన్లు ఇవే..
Redmi Note 15 Pro 5G
రూ.29,999 ధరలో లభించే ఈ ఫోన్‌లో 200MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. 20MP ఫ్రంట్ కెమెరా, 6.83 అంగుళాల 1.5K AMOLED 120Hz డిస్‌ప్లే దీని ప్రత్యేకతలు. MediaTek Dimensity 7400-Ultra ప్రాసెసర్, 6,580mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ ఉన్నాయి.
Vivo V60e
ఫొటోగ్రఫీ ప్రియులకు మరో ఆసక్తికరమైన ఎంపిక Vivo V60e. ఇందులో 200MP OIS కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP ఆటోఫోకస్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 6,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP68+IP69 రేటింగ్ లభిస్తాయి. 8GB+128GB వేరియంట్ ధర రూ.29,999.
Motorola Edge 70 Fusion
రూ.26,999 ప్రారంభ ధరతో వస్తున్న ఈ ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా, 13MP అల్ట్రా-వైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. Snapdragon 7s Gen 4 ప్రాసెసర్, 7,000mAh బ్యాటరీ, 68W ఛార్జింగ్, 144Hz AMOLED డిస్‌ప్లే ఉన్నాయి.
Samsung Galaxy F70 Pro 5G
రూ.25,999 నుంచి లభించే ఈ ఫోన్‌లో 50MP మెయిన్, 5MP అల్ట్రా-వైడ్, 2MP మ్యాక్రో కెమెరాలు ఉన్నాయి. 12MP సెల్ఫీ కెమెరా, 6,000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్, 120Hz Super AMOLED డిస్‌ప్లే ఉన్నాయి.
Nothing Phone 3a Pro
3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫొటో కెమెరా దీని ప్రధాన ఆకర్షణ. 50MP మెయిన్, 8MP అల్ట్రా-వైడ్, 50MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ప్రారంభ ధర రూ.27,999.