Google Mail Id : ఒకప్పుడు ఉత్తరాల ద్వారా సంభాషణలు జరుపుకున్న మనుషులు ఇప్పుడు.. ఖండాంతరాలలో ఉన్నప్పటికీ నేరుగా లైవ్ లో మాట్లాడుకునే స్థాయికి సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది. ఇక నేటి ఆధునిక కాలంలో ఉద్యోగాలు.. ఇతర వ్యవహారాలు జరపడానికి మెయిల్ ను ఉపయోగిస్తున్నారు. ఒకప్పుడు హాట్ మెయిల్, యాహూ వంటివి సందడి చేసేవి. కానీ ఇప్పుడు వాటి స్థానంలో గూగుల్ చేరింది. గూగుల్ సృష్టించిన సంచలనం వల్ల యాహూ, హాట్ మెయిల్ వంటివి పక్కకు తప్పుకున్నాయి. గూగుల్ మెయిల్ అనేది స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారికి సర్వసాధారణంగా మారిపోయింది. సైబర్ మోసాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో మెయిల్ వాడేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని గూగుల్ పదేపదే హెచ్చరిస్తోంది.. గూగుల్ మెయిల్ ను ఉద్యోగాల అప్లికేషన్ సమయంలో చాలామంది విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే చాలామంది ఐడీలను విభిన్నంగా రూపొందించుకుంటారు. అలాంటివారు చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే బాగుంటుందని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
నేటి కాలంలో ఉద్యోగాల ఎంపిక అనేది మొత్తం ఆన్లైన్ ద్వారా జరుగుతోంది. ఇంటర్వ్యూలు కూడా లైవ్ లోనే సాగిపోతున్నాయి. ఇంటర్వ్యూ తర్వాత తుది ఫలితాన్ని వెల్లడించడానికి కంపెనీలు మెయిల్ ద్వారా సమాచారాన్ని పంపిస్తున్నాయి. అంతేకాదు మెయిల్ ద్వారానే రెజ్యూమ్ లు కూడా స్వీకరిస్తున్నాయి. అయితే పెద్ద పెద్ద కంపెనీలకు ఉద్యోగార్థులు రెజ్యూమ్ లు పంపిస్తున్న క్రమంలో తమ ఐడీలను కూడా వారికి తెలియజేయాల్సి ఉంటుంది. ఈ ఐడీలను రూపొందించుకునే క్రమంలో చాలామంది విభిన్న తత్వాన్ని అవలంబిస్తున్నారు. అయితే అటువంటి విభిన్నమైన ఐడీలను పెద్ద పెద్ద కంపెనీలు పట్టించుకోవని తెలుస్తోంది. పైగా వాటిని పక్కన పడేస్తాయని సమాచారం. మెయిల్ ఐడిలో ముఖ్యంగా మన పేరు స్పష్టంగా ఉండాలట. అది కూడా ప్రొఫెషనల్ గా ఉండాలట. పనికిమాలిన పదాలు.. నెగిటివ్ అంశాలను స్పూరించే విషయాలను అందులో పేర్కొంటే కంపెనీలు పట్టించుకోవట. ” ఇప్పటికాలంలో ఉద్యోగం సంపాదించడం పెద్ద టాస్క్ అయిపోయింది. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడం అత్యంత కష్టమైన పని అయిపోయింది. ఉద్యోగాన్ని సంపాదించుకోవాలంటే అనేక రకాలైన అర్హతలు ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఉపయోగించే మెయిల్ అద్భుతంగా ఉండాలి. అందులో ఏమాత్రం అడ్డగోలు పదాలు ఉంటే కంపెనీలు పక్కన పెడుతున్నాయి. అమెరికా నుంచి మొదలు పెడితే ఇండియా వరకు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాయి. అందువల్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని” టెక్ నిపుణులు చెబుతున్నారు.
Also Read : యూజర్లకు గూగుల్ బంపర్ ఆఫర్.. త్వరలోనే ఆ ఫీచర్ అందుబాటులోకి..
” పనిచేయడానికి ఇష్టమైన వ్యక్తులు తమ హుందాతనాన్ని ప్రదర్శించాలి. అలాంటి వారి వల్లే కంపెనీలకు విలువ ఉంటుంది. కానీ కొంతమంది హుందాతనాన్ని ప్రదర్శించకుండా తిక్క తిక్కగా వ్యవహరిస్తూ ఉంటారు. అదే తత్వాన్ని తమ మెయిల్ ఐడి లలో కూడా ప్రయోగిస్తుంటారు. అలాంటివారిని కంపెనీలు పెద్దగా పట్టించుకోవు. కంపెనీలకు కావాల్సింది పనిచేసేవారు.. పనికిమాలిన వారు కాదని” జాబ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అందువల్లే ఐడి ప్రొఫెషనల్ గా ఉండాలని వారు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.