Elon Musk : ఎలోన్ మస్క్ 400 బిలియన్ డాలర్ల మొత్తం సంపదను కలిగి ఉన్నటువంటి ప్రపంచంలోని మొదటి వ్యక్తిగా నిలిచాడు. ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి చరిత్ర సృష్టించలేదు. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. స్పేస్ ఎక్స్ వ్యాపార విక్రయాల కారణంగా.. ఎలాన్ మస్క్ నికర విలువలో 50 బిలియన్ డాలర్లు అనూహ్యంగా పెరిగాయి. తన కంపెనీ టెస్లా షేర్లలో భారీ పెరుగుదల తర్వాత మస్క్ సంపద ఊహించని విధంగా పెరిగింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఎలోన్ మస్క్ నికర విలువ బుధవారం ఒక్క రోజే 62 బిలియన్ డాలర్లు పెరిగింది. మొత్తం నికర విలువ 447 బిలియన్ డాలర్లకు చేరుకుంది. విశేషమేమిటంటే, డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత ఎలోన్ మస్క్ నికర విలువలో 183 బిలియన్ డాలర్లు పెరిగాయి. మరోవైపు, టెస్లా షేర్లు కూడా మంచి పెరుగుదలను చవిచూశాయి. డిసెంబర్ 4 నుండి టెస్లా షేర్లు 72 శాతానికి పైగా పెరిగాయి.
బుధవారం బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం స్పేస్ ఎక్స్, దాని పెట్టుబడిదారులు కంపెనీ ఉద్యోగులు, ఇతర వ్యక్తుల నుండి 1.25 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేసేందుకు అంగీరించారు. ఈ డీల్ తర్వాత స్పేస్ ఎక్స్ విలువ 350 బిలియన్ డాలర్లుగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ స్టార్టప్‌గా అవతరించింది. ఈ ఒప్పందం కారణంగా ఎలాన్ మస్క్ నికర విలువలో 50 బిలియన్ డాలర్లు పెరిగాయి. మరోవైపు టెస్లా షేర్లు పెరగడం వల్ల ఎలాన్ మస్క్ సంపద కూడా పెరిగి 12 బిలియన్ డాలర్లు లాభపడింది. ఎలోన్ మస్క్ ఒక్క రోజులో 62 బిలియన్ డాలర్ల లాభం ఆర్జించాడు. ఆ తర్వాత అతని మొత్తం నికర విలువ 447 బిలియన్ డాలర్లకు పెరిగింది.
183 బిలియన్ డాలర్ల పెరుగుదల
అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత ఎలాన్ మస్క్ సంపద పెరుగుదల మరింత పెరిగింది. నవంబర్ 5న ఎలోన్ మస్క్ నికర విలువ 264 బిలియన్ డాలర్లు. ఇప్పుడు అతని నికర విలువ 447 బిలియన్ డాలర్లు దాటింది. అంటే ఎలోన్ మస్క్ సంపద అతి తక్కువ సమయంలో 183 బిలియన్ డాలర్లు పెరిగింది. ప్రస్తుత సంవత్సరంలో 200 బిలియన్ డాలర్లకు పైగా పెరుగుదల కనిపించింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, జూలై 1, 2023 నాటికి, ఎలోన్ మస్క్ నికర విలువ 126 బిలియన్ డాలర్లు. ఇందులో సుమారు ఒకటిన్నర సంవత్సరాలలో 3.55 రెట్లు అంటే 255 శాతం పెరుగుదల కనిపించింది.
టెస్లా రికార్డు స్థాయిలో షేర్లు
మరోవైపు టెస్లా షేర్లలో మంచి పెరుగుదల ఉంది. బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో, టెస్లా షేర్లు సుమారు 6 శాతం పెరిగాయి. జీవితకాల గరిష్ట స్థాయి 424.88డాలర్లకి చేరుకుంది. టెస్లా షేర్లు నవంబర్ 4 నుండి మంచి పెరుగుదలను చూస్తున్నాయి. నవంబర్ 4న కంపెనీ షేర్ల విలువ 242.84 డాలర్లు. ఇందులో ఇప్పటి వరకు 75 శాతం వరకు పెరుగుదల కనిపించింది. అమెరికా స్టాక్ మార్కెట్ ముగిసిన తర్వాత, టెస్లా షేర్లు 5.93 శాతం లాభంతో 424.77డాలర్ల వద్ద ముగిసింది.
500 బిలియన్ డాలర్లపై దృష్టి
ఇప్పుడు ఎలోన్ మస్క్ ఈ సంవత్సరం ముగిసేలోపు 500 బిలియన్ డాలర్లపై దృష్టి పెట్టాడు. అక్కడికి చేరుకోవడానికి, ఎలోన్ మస్క్‌కి 15 రోజుల కంటే ఎక్కువ సమయం ఉంది. ఎలోన్ మస్క్‌కి 53 బిలియన్ డాలర్లు మాత్రమే అవసరం. అంటే 500 బిలియన్ డాలర్ల మార్కును చేరుకోవాలంటే, ఎలోన్ మస్క్ సంపద ప్రతిరోజూ సగటున 2.76 బిలియన్ డాలర్లు పెరగాలి. నవంబర్ 5 నుండి ప్రతిరోజూ ఎలోన్ మస్క్ సంపదలో సగటున 5 బిలియన్ డాలర్ల పెరుగుదల ఉంది. మస్క్ సంపద సంవత్సరం చివరి నాటికి 500 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Elon musk elon musks wealth exceeded 400 billion dollars for the first time how much did his wealth increase in one day
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com