Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీApple AI Pin Camera: ఎక్కడైనా కెమెరా పెట్టుకోవచ్చు.. ఆపిల్ సంచలనం.. ఫీచర్లు.. పనిచేసే విధానం.....

Apple AI Pin Camera: ఎక్కడైనా కెమెరా పెట్టుకోవచ్చు.. ఆపిల్ సంచలనం.. ఫీచర్లు.. పనిచేసే విధానం.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం

Apple AI Pin Camera: టెక్నాలజీని అమితంగా ఇష్టపడే వారికి ఆపిల్ కంపెనీ ప్రతిక్షణం ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆపిల్ కంపెనీ రూపొందించే ఉత్పత్తులు అద్భుతంగా ఉంటాయి. కాలాన్ని ముందుగానే ఊహించి.. జరగబోయే పరిణామాలను విశ్లేషించి ఆపిల్ కంపెనీ ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటుంది. ఫోన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇయర్ బడ్స్ ఆపిల్ కంపెనీ సంచలనాలు సృష్టిస్తూనే ఉంటుంది. కంపెనీలు ఆపిల్ ఉత్పత్తులను కాపీ కొడితే.. ఆపిల్ మాత్రం ఏకంగా భవిష్యత్తును […]

Apple AI Pin Camera: టెక్నాలజీని అమితంగా ఇష్టపడే వారికి ఆపిల్ కంపెనీ ప్రతిక్షణం ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆపిల్ కంపెనీ రూపొందించే ఉత్పత్తులు అద్భుతంగా ఉంటాయి. కాలాన్ని ముందుగానే ఊహించి.. జరగబోయే పరిణామాలను విశ్లేషించి ఆపిల్ కంపెనీ ఉత్పత్తులను తయారు చేస్తూ ఉంటుంది. ఫోన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇయర్ బడ్స్ ఆపిల్ కంపెనీ సంచలనాలు సృష్టిస్తూనే ఉంటుంది. కంపెనీలు ఆపిల్ ఉత్పత్తులను కాపీ కొడితే.. ఆపిల్ మాత్రం ఏకంగా భవిష్యత్తును ఊహించి.. మనిషికి అవసరాలు సృష్టించి.. వాటి ఆధారంగా ఉత్పత్తులు తయారు చేస్తూ ఉంటుంది.

కృత్రిమ మేధ ను ఉపయోగించి పనిచేసే స్మార్ట్ పరికరాలు ఉత్పత్తి అవుతున్నాయి.. అన్ని కంపెనీలు దాదాపు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా స్మార్ట్ పరికరాలను తయారు చేస్తున్నాయి అయితే ఇందులో మిగతా వాటికంటే ఆపిల్ కంపెనీ ముందుంది. ఆపిల్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే కేంద్రాలను రూపొందించడమే మాత్రమే కాకుండా.. వాటిని జస్ట్ షర్ట్ బటన్ పరిమాణంలో తయారు చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. మెటా ఏఐ గ్లాసెస్ తో పోటీపడే విధంగా ఏ ఐ స్మార్ట్ గ్లాసెస్ కెమెరాతో.. ఎయిర్ పాడ్ ను ఆపిల్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. 2027 లో దీనిని మార్కెట్లోకి ప్రవేశపడుతుందని తెలుస్తోంది. ఇందులో అంతర్నిర్మిత కెమెరా ఉందని.. అది అద్భుతమైన చిత్రాలను తీస్తుందని సమాచారం.

ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే గాడ్జెట్ ల మాదిరిగా కాకుండా .. ఆపిల్ కంపెనీ కుపెర్టినో టెక్నాలజీ ఆధారంగా పనిచేసేలా దీనిని ఆపిల్ కంపెనీ రూపొందించినట్టు తెలుస్తోంది.. ఆపిల్ ఏఐ పిన్ ను ఐఫోన్ కు యాడ్ ఆన్ గా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో అంతర్ నిర్మిత కెమెరా.. మైక్రోఫోన్ ఉంటుంది. ఇది ఫోన్ కు కళ్ళు, చెవుల మాదిరిగా పనిచేస్తుంది..

అంతర్జాతీయ మీడియా నివేదిక ప్రకారం ఆపిల్ ఏఐ పిన్ అత్యంత ఆధునికమైన సిరి, విజువల్ ఇంటెలిజెన్స్ తో సహా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడుతుందని తెలుస్తోంది. అయితే టెక్నాలజీ పరంగా ఆపిల్ ఇంకా సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నట్టు తెలుస్తోంది.. ఈ ఉత్పత్తిని పర్యావరణహితంగా ఆపిల్ తయారు చేస్తోంది. కెమెరా, వైర్లెస్ చార్జింగ్, దుస్తులపై క్లిక్ చేసే విధంగా.. మెడ చుట్టూ ధరించే విధంగా.. కాంపాక్ట్ డిజైన్ తో రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.. ఏఐ పిన్ సన్నని.. చదునైన వృత్తకార డిస్క్ ఆకారంలో.. ఎయిర్ ట్యాగు లాంటి పరిమాణంలో వస్తుందని టెక్నాలజీ నిపుణులు భావిస్తున్నారు. ఇది అల్యూమినియం, గ్లాస్ షెల్, ఒక అంచుపై ఫిజికల్ న్యూట్రల్ బటన్ కలిగి ఉంటుందని సమాచారం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper