Homeఆంధ్రప్రదేశ్‌Roja enters Tamil Politics: తమిళ రాజకీయాల్లోకి రోజా?!

Roja enters Tamil Politics: తమిళ రాజకీయాల్లోకి రోజా?!

Roja enters Tamil Politics: వైయస్సార్ కాంగ్రెస్ మాజీ మంత్రి రోజా( RK Roja) రూటు మార్చినట్టు కనిపిస్తున్నారు. మొన్న మధ్యన ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడిచింది. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి, నగిరి నియోజకవర్గం విషయంలో జరిగిన పరిణామాలతో.. ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని.. తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోతారని తెగ ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఆమె కొద్ది […]

Roja enters Tamil Politics: వైయస్సార్ కాంగ్రెస్ మాజీ మంత్రి రోజా( RK Roja) రూటు మార్చినట్టు కనిపిస్తున్నారు. మొన్న మధ్యన ఆమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడిచింది. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి, నగిరి నియోజకవర్గం విషయంలో జరిగిన పరిణామాలతో.. ఆమె తీవ్ర మనస్థాపానికి గురయ్యారని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని.. తిరిగి సినిమాల్లోకి వెళ్లిపోతారని తెగ ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఆమె కొద్ది రోజులపాటు పెద్దగా కనిపించలేదు. అంతా నిజమని భావిస్తున్న తరుణంలో ఆమె ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అయ్యారు. అయితే తాజాగా ఆమె తమిళ రాజకీయాల వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.

దక్షిణాది రాష్ట్రాల్లో స్టార్ హీరోయిన్ గా..
వాస్తవానికి ఆర్కే రోజా దక్షిణాది రాష్ట్రాల్లో( South States ) సుపరిచితురాలు. ఉత్తరాది భాషల్లో ఆమె నటించారు. నటిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఈ క్రమంలోనే ఆమె తమిళ దర్శకుడు సెల్వమణి ని వివాహం ఆడారు. తరువాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి చాలా రోజులపాటు తెలుగుదేశం పార్టీలో పని చేశారు. ఆ పార్టీ తరఫున దయచేసి ఓడిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున మూడుసార్లు పోటీ చేసి విజయం సాధించారు. మంత్రిగా కూడా ఛాన్స్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. వైసిపి హయాంలో దూకుడు కలిగిన నేతగా కూడా గుర్తింపు సాధించారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆమె కొద్ది రోజులపాటు సైలెంట్ అయ్యారు. తిరిగి సినిమాల వైపు వెళ్తారని.. తమిళనాడులో విజయ్ పార్టీలో చేరుతారని తెగ ప్రచారం నడిచింది. కానీ ఆమె మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని.. జగన్మోహన్ రెడ్డిని విడిచిపెట్టి వెళ్లే ఛాన.

స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో..
అయితే ఈ పరిస్థితుల్లో ఉంటే మాజీ మంత్రి ఆర్కే రోజా తమిళనాడు సీఎం స్టాలిన్( Tamil Nadu CM Stalin ) పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. స్టాలిన్ పాలనను మెచ్చుకోవడమే కాదు.. చంద్రబాబు పాలనపై ఆమె విమర్శలు కూడా చేశారు. మరోవైపు రోజా త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తారని తెలుస్తోంది. అయితే క్రమేపి ఆమె డీఎంకేకు దగ్గరైన సూచనలు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడెందుకు ఆమె ప్రత్యేక ప్రణాళికతో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఒకవేళ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె కూటమి విజయం సాధిస్తే.. ఆ పార్టీ తరపున నామినేటెడ్ పదవి తీసుకొని.. ఏపీ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటారని విశ్లేషకులు చెబుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper