IND VS BAN Test Match : 23/2 వద్ద రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు మరో 13 పరుగులు జత చేసి మోమినుల్ హక్ క్రికెట్ కోల్పోయింది. 8 బంతులు ఎదుర్కొన్న మోమినుల్ హక్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ దశలో బంగ్లాదేశ్ భారత బౌలర్ల ఎదుట దాసోహం అవడం ఖాయం అని అందరూ అనుకున్నారు.. అయితే ఓపెనర్ షాద్మాన్ ఇస్లాం(50: 101 బంతుల్లో 10 ఫోర్లు), కెప్టెన్ నజ్ముల్ శాంటో(19: 37 బంతుల్లో రెండు ఫోర్లు) నాలుగో వికెట్ కు 55 పరుగులు జోడించారు. వారిద్దరూ కొరకరాని కొయ్యగా మారిన నేపథ్యంలో.. రవీంద్ర జడేజా అద్భుతమైన బంతివేసి శాంటో ను అవుట్ చేశాడు.. జడేజా వేసిన బంతిని అంచనా వేయలేక శాంటో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత 50 పరుగులు చేసిన షాద్మాన్ ఇస్లాం కూడా ఆకాష్ దీప్ బౌలింగ్ లో యశస్వి జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇస్లాం అవుట్ అయిన తర్వాత లిటన్ దాస్ క్రీజ్ లోకి వచ్చాడు.. అతడు కేవలం ఎనిమిది బంతులు మాత్రమే ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేశాడు.. రవీంద్ర జడేజా మ్యాజికల్ డెలివరీకి కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. షకీబ్ అల్ హసన్ కూడా పరుగులేమీ చేయకుండానే జడేజా చేతిలో క్యాచ్ అండ్ బౌల్డ్ గా వెనుతిరిగాడు.
మూడు పరుగుల వ్యవధిలోనే..
ఒకానొక దశలో బంగ్లా జట్టు 90/3 వద్ద పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ జట్టు స్కోరు 91 పరుగులకు చేరుకోగానే రవీంద్ర జడేజా వేసిన బంతిని తప్పుగా అంచనా వేసి కెప్టెన్ శాంటో తగిన మూల్యం చెల్లించుకున్నాడు. జడేజా వేసిన డెలివరీ శాంటో వికెట్లను పడగొట్టింది. అప్పటికి బంగ్లా స్కోరు 91 పరుగులకు చేరుకుంది. ఆ తర్వాత అర్ధ సెంచరీ చేసి సౌకర్యవంతంగా కనిపించిన ఇస్లాం ఆకాశ్ దీప్ బౌలింగ్ లో యశస్వి జైస్వాల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన లిటన్ దాస్ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి రవీంద్ర జడేజా బౌలింగ్ లో కీపర్ రిషబ్ పంత్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాత వచ్చిన షకీబ్ అల్ హసన్ రవీంద్ర జడేజా చేతిలో క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. ఇలా బంగ్లాదేశ్ జట్టు కేవలం మూడు పరుగుల వ్యవధిలోనే నాలుగు కీలకమైన వికెట్లను కోల్పోవడం భారత జట్టులో ఉత్సాహాన్ని రేకెత్తించింది.. ప్రస్తుతం బంగ్లాదేశ్ 113/7 వద్ద నిలిచింది. క్రీజ్ లో ముష్ఫికర్ రహీం (10), హసన్ మిరాజ్ (9) కొనసాగుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తలా మూడు వికెట్లు పడగొట్టారు. ఆకాష్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ 62 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది.
That’s the breakthrough!
A beautiful delivery by @imjadeja as the Bangladesh Captain is bowled out.
Live – https://t.co/JBVX2gyyPf… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/AujYNbHTLV
— BCCI (@BCCI) October 1, 2024
&
2ND Test. WICKET! 28.4: Shadman Islam 50(101) ct Yashasvi Jaiswal b Akash Deep, Bangladesh 93/5 https://t.co/VYXVdyNHMN #INDvBAN @IDFCFIRSTBank
— BCCI (@BCCI) October 1, 2024
;
Ravindra Jadeja picks up his second wicket as Litton Das is caught behind for 1 run.
Live – https://t.co/JBVX2gyyPf……… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/C4HFqtI3ez
— BCCI (@BCCI) October 1, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: The indian bowlers were sensational by taking four wickets in the span of three runs in the kanpur test
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com