Homeలైఫ్ స్టైల్Happiness Tips : హ్యాపీనెస్ కు ఐదు సూత్రాలు.. ఇది మీకు తెలుసా?

Happiness Tips : హ్యాపీనెస్ కు ఐదు సూత్రాలు.. ఇది మీకు తెలుసా?

Happiness Tips : జీవితంలో ఎవరైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే సంతోషమంటే అధిక డబ్బు ఉండడమా? లేక రిలేషన్స్ మెయింటైన్ చేయడమా? లేక సొంత ఇల్లు కలిగి ఉండడమా? అనే విషయంలో చాలామంది అయోమయానికి గురవుతున్నారు. వాస్తవానికి సంతోషం అనేది ఏ ప్రదేశంలోనూ.. ఏ డబ్బులోను ఉండదు. మన మనసులోనే ఉంటుంది. మనకు కోరికలు ఎక్కువగా ఉంటే సంతోషం దూరమవుతుంది.. కోరికలు పరిమితం చేసుకొని ఉన్నదాంట్లో తృప్తి పడితే హ్యాపీగా ఉంటారని కొందరు మానసిక […]

Happiness Tips : జీవితంలో ఎవరైనా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అయితే సంతోషమంటే అధిక డబ్బు ఉండడమా? లేక రిలేషన్స్ మెయింటైన్ చేయడమా? లేక సొంత ఇల్లు కలిగి ఉండడమా? అనే విషయంలో చాలామంది అయోమయానికి గురవుతున్నారు. వాస్తవానికి సంతోషం అనేది ఏ ప్రదేశంలోనూ.. ఏ డబ్బులోను ఉండదు. మన మనసులోనే ఉంటుంది. మనకు కోరికలు ఎక్కువగా ఉంటే సంతోషం దూరమవుతుంది.. కోరికలు పరిమితం చేసుకొని ఉన్నదాంట్లో తృప్తి పడితే హ్యాపీగా ఉంటారని కొందరు మానసిక నిపుణులు చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు రకరకాల కారణాలవల్ల మానసిక ఇబ్బందులతో ఉన్నవారు.. ఇకనుంచి సంతోషంగా ఉండాలంటే కొన్ని సూత్రాలను పాటించాల్సి ఉంటుంది. అందులో వీటి గురించి చెప్పుకుందాం..

ఉదయం నుంచి రాత్రి వరకు.. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఏదో ఒక పనితో బిజీగా ఉంటూనే ఉంటారు. అయితే ఈ వారంలో సమయం దొరికినప్పుడు లేదా వారాంతంలో కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయాలి. తమ సంతోషాలను, బాధలను, దుఃఖాలను పంచుకుంటూ ఒకరి గురించి ఒకరు చెప్పుకుని స్వేచ్ఛను కలిగి ఉండాలి. వీలైతే కుటుంబం మీద స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలి. వారంలో ఉన్న బాధ్యతలను వారాంతంలో ఒక్కసారిగా పక్కన ఉంచి ఇలా మానసికంగా ప్రశాంతంగా ఉంటే మరో వారం రోజులపాటు ప్రత్యేక ఎనర్జీ కలుగుతుంది.

ప్రస్తుత కాలంలో అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు అన్నిట్లో ప్రోటీన్లు ఉన్నాయని చెప్పడానికి వీలులేదు. ఎందుకంటే కొన్నిటిలో రుచికరమైన పదార్థాలు ఉంటున్నాయి కానీ.. అందులో పౌష్టికాహారం కనిపించడం లేదు. వీటికి తోడు ప్రస్తుత కాలంలో చాలామంది కూర్చొని చేసే పనిలే ఉంటున్నాయి. ఇలాంటి అప్పుడు శారీరక శ్రమకు అలవాటు తప్పినట్లు అవుతుంది. అందువల్ల సందర్భంగా వచ్చినప్పుడల్లా శారీరక శ్రమను ఉపయోగించడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. దీంతో మానసిక ఒత్తిడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది.

ప్రతి ఒక్కరి జీవితం మరొకరితో ముడిపడి ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకంటే వారి కుటుంబ, ఇతర పరిస్థితుల ఆధారంగా భిన్నంగా ఉంటాయి. ఇలాంటి అప్పుడు ఒకరి జీవితాన్ని మరొకరి జీవితంతో పోల్చుకోవడం మానేయాలి. అలాగే నిన్నటి విషయాలలో ఎంత నష్టపోయాం? ఎంత లాభపడ్డాం? అనే వాటిని పరిశీలించి మరోసారి నష్టపోకుండా ప్రణాళిక వేసుకోవాలి.

ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయి.. అలాగే సంతోషాలు కూడా ఉంటాయి. సంతోషం వచ్చినప్పుడు హ్యాపీగా ఉండి.. కష్టం వచ్చినప్పుడు బాధపడుతూ ఉండడం వల్ల మానసికంగా ఇబ్బందులు ఏర్పడతాయి. రెండు విషయాలను సమానంగా స్వీకరిస్తే ఎలాంటి కష్టం అనిపించదు. తద్వారా మానసికంగా కూడా ఉల్లాసంగా ఉండగలుగుతారు.

చాలావరకు అవసరంలేని విషయాలు ఎదురవుతూ ఉంటాయి. వీటి గురించి ఆలోచించడం లేదా వాటిని పట్టించుకోవడం ద్వారా అవసరమైన విషయాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటి అప్పుడు పనికిరాని విషయాలను పట్టించుకోకుండా అవసరం ఉన్నవాటి వైపే మగ్గుచూపాలి. ఇలా ఉండడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper