Homeక్రీడలుక్రికెట్‌India vs England: టీమిండియాలోకి సరైనోడు వచ్చాడు.. ఇంగ్లాండ్ కు ఇక సావే..

India vs England: టీమిండియాలోకి సరైనోడు వచ్చాడు.. ఇంగ్లాండ్ కు ఇక సావే..

India vs England: టి20 సిరీస్ కోల్పోయింది. నేడు చివరి మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టుతో టీమ్ ఇండియా ఆడుతోంది. ఈ మ్యాచ్లో గెలిచి వరుస ఓవటములకు చెక్ పెట్టాలని టీమిండియా భావిస్తోంది. అందువల్లే జట్టులో అనేక రకాల మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. టి20 సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో వన్డే సిరీస్ మొదలుపెడుతుంది. ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కు టీమిండియా మేనేజ్మెంట్ విరాట్ కోహ్లీని.. రోహిత్ శర్మను ఎంపిక చేసింది. […]

India vs England: టి20 సిరీస్ కోల్పోయింది. నేడు చివరి మ్యాచ్ ఇంగ్లాండ్ జట్టుతో టీమ్ ఇండియా ఆడుతోంది. ఈ మ్యాచ్లో గెలిచి వరుస ఓవటములకు చెక్ పెట్టాలని టీమిండియా భావిస్తోంది. అందువల్లే జట్టులో అనేక రకాల మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టింది. టి20 సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ జట్టుతో వన్డే సిరీస్ మొదలుపెడుతుంది.

ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ కు టీమిండియా మేనేజ్మెంట్ విరాట్ కోహ్లీని.. రోహిత్ శర్మను ఎంపిక చేసింది. వారిద్దరు ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్నారు. కొంతకాలంగా విరాట్ ఇంగ్లాండ్లోనే తన కుటుంబంతో ఉంటున్నాడు. కెప్టెన్ గిల్ కూడా ఇంగ్లాండ్ లోనే ఉన్నాడు. ప్రస్తుతం అతడు వింబుల్డన్ పోటీలను ఆస్వాదిస్తున్నాడు. టీమిండియాలో మిగతా ప్లేయర్లు మైదానంలో తీవ్రంగా సాధన చేస్తున్నారు. వీరిలో రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. రోహిత్ శర్మ ఇటీవల బరువు తగ్గాడు. మైదానంలో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐపీఎల్ లో అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ.. ఇటీవలి వన్డే సిరీస్ లో టీమిండియా తరఫున మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ గడ్డమీద అతడు అద్భుతంగా ఆడతాడని.. గత రికార్డులను అధిగమిస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

టీమిండియా వరుసగా రెండో టి20 సిరీస్లను కోల్పోయిన నేపథ్యంలో.. పోయిన ఆ పరువును ఇంగ్లాండ్ జట్టుతో జరిగే వన్డే సిరీస్ దక్కించుకోవడం ద్వారా భర్తీ చేయాలని భావిస్తోంది. ఇంగ్లాండ్ జట్టు అంటే వీరోచితంగా బ్యాటింగ్ చేసే విరాట్ కోహ్లీకి జట్టులో చోటు కల్పించడం ద్వారా.. ముందుగానే టీమ్ ఇండియా మేనేజ్మెంట్ హెచ్చరికలు పంపింది. దీనికి తోడు ఇంగ్లాండ్ పిచ్ ల మీద విరాట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కొంతకాలంగా అతడు అదే పనిలో ఉన్నాడు. మేనేజ్మెంట్ కూడా అతడికి పూర్తిస్థాయిలో సహకారం అందించింది. దీంతో అతడు ఒకప్పటి మాదిరిగా పరుగులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంగ్లీష్ బౌలర్లను ఒక ఆట ఆడుకోవడానికి రెడీగా ఉన్నాడు. ఇంగ్లాండ్ మీద సిరీస్ ఎలాగైనా గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper