Homeక్రీడలుక్రికెట్‌India Semifinal Qualification Scenario T20 World Cup: టీమిండియా కొంప ముంచిన వెస్టిండీస్.. సెమీ...

India Semifinal Qualification Scenario T20 World Cup: టీమిండియా కొంప ముంచిన వెస్టిండీస్.. సెమీ ఫైనల్ వెళ్లాలంటే ఇన్ని అద్భుతాలు జరగాలి!

India Semifinal Qualification Scenario T20 World Cup: చేతిలో ఉన్న బెల్లాన్ని చీమల పాలు చేసినా తర్వాత.. పుట్టలో వెతికినా.. గుట్ట పై వెతికినా ఉపయోగం ఉండదు అంటారు. ఇప్పుడు టీమిండియా పరిస్థితి కూడా అలానే మారిపోయింది. టి20 వరల్డ్ కప్ లో టీమిండియా టైటిల్ ఫేవరెట్. అందులో ఏమాత్రం అనుమానం లేదు. లీగ్ దశలో సత్తా చూపించిన తర్వాత.. టీమిండియా సూపర్ 8 దశలో మాత్రం దారుణమైన ఓటమిని ఎదుర్కొంది. సౌత్ ఆఫ్రికా చేతిలో […]

India Semifinal Qualification Scenario T20 World Cup: చేతిలో ఉన్న బెల్లాన్ని చీమల పాలు చేసినా తర్వాత.. పుట్టలో వెతికినా.. గుట్ట పై వెతికినా ఉపయోగం ఉండదు అంటారు. ఇప్పుడు టీమిండియా పరిస్థితి కూడా అలానే మారిపోయింది. టి20 వరల్డ్ కప్ లో టీమిండియా టైటిల్ ఫేవరెట్. అందులో ఏమాత్రం అనుమానం లేదు. లీగ్ దశలో సత్తా చూపించిన తర్వాత.. టీమిండియా సూపర్ 8 దశలో మాత్రం దారుణమైన ఓటమిని ఎదుర్కొంది. సౌత్ ఆఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది.

ఈ ఓటమి వల్ల టీమిండియా పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఇదే రాచ పుండు మాదిరిగా టీమిండియాను ఇబ్బంది పెడుతుంటే.. వెస్టిండీస్ చేతిలో జింబాబ్వే దారుణమైన ఓటమిని ఎదుర్కోవడం టీమ్ ఇండియాను దారుణమైన స్థితిలోకి నెట్టేసింది. వెస్టిండీస్ జింబాబ్వే మీద 254 పరుగులు చేయడంతో.. నెట్ రన్ రేట్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టు 5.35 నెట్ రన్ రేట్ తో మొదటి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా జట్టు 3.80 నెట్ రన్ రేట్ తో రెండవ స్థానంలో ఉంది. ఇండియా -3.80 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది.

భారత జట్టు సెమీఫైనల్ వెళ్లాలంటే వెస్టిండీస్ ను సౌత్ ఆఫ్రికా ఓడించాలి. భారత్ జింబాబ్వే ను, వెస్టిండీస్ జట్లను భారీ తేడాతో ఓడించాలి. అంతేకాదు, జింబాబ్వే జట్టును భారత్ ఓడించాలి. దక్షిణాఫ్రికా కూడా ఓడించాలి. అప్పుడే టీమ్ ఇండియాకు లైన్ క్లియర్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెస్టిండీస్ జట్టును దక్షిణాఫ్రికా ఓడించగలుగుతుందా? అనేది పెద్ద అనుమానం. ఒకవేళ దక్షిణాఫ్రికా జింబాబ్వే చేతుల్లో ఓడిపోయి.. వెస్టిండీస్ చేతులో కూడా ఓడిపోతే అప్పుడు టీం ఇండియాకు లైన్ క్లియర్ అవుతుంది. భారత జట్టు కేవలం జింబాబ్వే, వెస్టిండీస్ పై గెలవడం మాత్రమే కాదు.. ఈ సమీకరణాలు కూడా తోడు కావాలి. అప్పుడే టీమ్ ఇండియా సెమీఫైనల్ వెళ్తుంది.

దక్షిణాఫ్రికా చేతిలో భారీ అంతరంతో ఓడిపోవడం వల్ల టీమ్ ఇండియాకు ఈ దుస్థితి దాపురించింది. ఒకవేళ టీమిండియా దక్షిణాఫ్రికా జరిగిన మ్యాచ్లో చివరి ఓవర్లలో మెరుగ్గా బ్యాటింగ్ చేసి ఉంటే.. అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయేది. కానీ, భారత జట్టు ప్లేయర్ల నిర్లక్ష్యం చివరికి ఇంతటి దానికి దారి తీసింది.

ఒకవేళ భారత జట్టు జింబాబ్వే చేతిలో ఓటమిపాలైతే.. అప్పుడు పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా జింబాబ్వే, వెస్టిండీస్ చేతిలో ఓడిపోవలసి ఉంటుంది. అంతేకాదు టీమిండియా తమ చివరి మ్యాచ్ లో వెస్టిండీస్ పై భారీ తేడాతో గెలవాలి. అప్పుడు జింబాబ్వే, భారత్ ఖాతాలో చెరి రెండు పాయింట్లు ఉంటాయి. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ కలిగిన జట్టు సెమీఫైనల్ వెళ్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper