T20 World Cup Pakistan Boycott: మరో వారం రోజుల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక కలిసి నిర్వహిస్తున్నాయి. ఈ టోర్నీ నుంచి భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ తప్పుకుంది. ఐసీసీ బంగ్లాదేశ్‌ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ మొండిగా వ్యవహరించిన బంగ్లాదేశ్‌ను దొబ్బేయమని తప్పించింది. స్కాట్‌లాండ్‌ను ఎంపిక చేసుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. మిగతా మ్యాచ్‌లు ఆడుతామని ప్రకటించింది. ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత–పాక్ జరుగనుంది, శ్రీలంకలో షెడ్యూల్ చేసినా ఇది మారలేదు.
బహిష్కరణకు కారణాలు..
పాకిస్తాన్ మొదటి నుంచి భారత్‌లో ఆడేందుకు విముఖత చూపింది. గత రికార్డుల్లో భారత్‌పై ఒక్క విజయం మాత్రమే ఉండటం, ఓటమి భయం దాని వెనుక కారణమని విమర్శలు వస్తున్నాయి. ఐసీసీ ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది, పాకిస్తాన్ జట్టు ఇతర మ్యాచ్‌లు ఆడుతుందని చెప్పుకుంది. ఉన్నఫలంగా షెడ్యూల్ మార్చడం కుదరదని ఐసీసీ ప్రకటించింది.
భారత్‌కు లాభం, పాక్‌కు నష్టం
పాక్ బహిష్కరణతో భారత్‌కు రెండు పాయింట్లు దక్కణం. పాకిస్తాన్ స్కోర్ సున్నా, రన్ రేట్, ర్యాంకింగ్ పడిపోతాయి. ఫైనల్‌లో భారత్‌తో ఎదుర్కొంటే మళ్లీ బాయ్‌కాట్ చేస్తారా అన్న చర్చ ఊపందుకుంది. ఈ చర్యలు టోర్నీ షెడ్యూల్‌ను డిస్టర్బ్ చేస్తుంది.
పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ నఖ్వీ ఆసియా కప్‌లో పాకిస్తాన్ ఓటమిని జీర్ణించుకోలేదు. భారత్ నఖ్వీ చేతులమీదుగా కప్ తీసుకునేందుకు నిరాకరించింది. ఇప్పుడు ఐసీసీని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ నష్టపోయేది పాకిస్తానే. ఆర్థికంగా కూడా భారీగా నష్టపోతుందని పండితులు అంచనా వేస్తున్నారు.