Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Teaser: 'ధురంధర్ 2' టీజర్ లో మిస్ అయ్యింది అదే..ఇది సినిమాపై ఎఫెక్ట్...

Dhurandhar 2 Teaser: ‘ధురంధర్ 2’ టీజర్ లో మిస్ అయ్యింది అదే..ఇది సినిమాపై ఎఫెక్ట్ చూపనుందా?

Dhurandhar 2 Teaser: గత ఏడాది డిసెంబర్ 4న విడుదలైన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం మూవీ లవర్స్ కి ఇచ్చిన థియేట్రికల్ అనుభూతి సాధారణమైనది కాదు. డైరెక్టర్ ఆదిత్య డర్ కి వచ్చిన ఆలోచనకు సెల్యూట్ చేశారు అందరూ. పాకిస్తాన్ లో టెర్రరిజాన్ని ఎలా పెంచి పోషిస్తున్నారు, అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది కళ్ళకి కట్టినట్టు చూపించాడు. అలా చూపించడం కోసం డైరెక్టర్ ఆదిత్య చేసిన రీసెర్చ్ కి చేతులెత్తి దండం పెట్టొచ్చు. ఈ సినిమాని […]

Dhurandhar 2 Teaser: గత ఏడాది డిసెంబర్ 4న విడుదలైన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం మూవీ లవర్స్ కి ఇచ్చిన థియేట్రికల్ అనుభూతి సాధారణమైనది కాదు. డైరెక్టర్ ఆదిత్య డర్ కి వచ్చిన ఆలోచనకు సెల్యూట్ చేశారు అందరూ. పాకిస్తాన్ లో టెర్రరిజాన్ని ఎలా పెంచి పోషిస్తున్నారు, అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయి అనేది కళ్ళకి కట్టినట్టు చూపించాడు. అలా చూపించడం కోసం డైరెక్టర్ ఆదిత్య చేసిన రీసెర్చ్ కి చేతులెత్తి దండం పెట్టొచ్చు. ఈ సినిమాని తీయడమే కాదు, స్క్రిప్ట్ ని రెడీ చేయడం కూడా చాలా కష్టమే. దేశం మీద నరనరాల్లో భక్తి ఉంటే తప్ప ఇలాంటి స్క్రిప్ట్ ని రెడీ చెయ్యలేరు. ఇక ఈ చిత్రం లోని నటీనటులు కూడా నటించలేదు, జీవించారు అనే చెప్పాలి. ముఖ్యంగా రెహమాన్ డెకాయిట్ పాత్ర పోషించిన అక్షయ్ ఖన్నా ఈ చిత్రానికి ఆయువుపట్టు లాంటి వాడు.

ఆయన లేని ‘ధురంధర్’ చిత్రాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. దేశంలో సినిమాని ఇష్టపడే ప్రతీ ఒక్కరు ఈ చిత్రం లో ఆయన నటనకు వీరాభిమానులు అయిపోయారు. అలాంటి నటుడు ‘ధురంధర్ 2 – ది రివెంజ్'(Dhurandhar 2 : The Revenge) లో లేడు. ఆయన క్యారెక్టర్ ని మొదటి భాగం లోనే ముగించేశారు. రెండవ భాగం లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో ఒకవేళ రెహమాన్ డెకాయిట్ పాత్ర కనిపించొచ్చు. కానీ అది అతిథి పాత్ర లాగానే ఉంటుంది. సినిమా పై ఎలాంటి ప్రభావం చూపించదు. ఇప్పుడు ఈ రెహమాన్ డెకాయిట్ పాత్ర లేకుండా ‘ధురంధర్ 2’ చిత్రాన్ని ఊహించుకోవడం కష్టం గా ఉందని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయగా, అందులో ఎక్కడా కూడా రెహమాన్ డెకాయిట్ పాత్రకు సంబంధించిన షాట్స్ లేకపోవడం, కాస్త అభిమానులను నిరాశకు గురి చేసింది.

టీజర్ ఓవరాల్ గా అదిరిపోయినప్పటికీ, ఆ పాత్ర కూడా ఉండుంటే బాగుండేది అనే ఫీలింగ్ ని కలిగించింది. ఇకపోతే ‘ధురంధర్ 2 : ది రివెంజ్’ చిత్రాన్ని మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా ‘ధురంధర్’ చిత్రం ఓటీటీ లో విడుదలైంది తెలుగు ఆడియన్స్ నుండి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. కాబట్టి తెలుగు లో కూడ ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి పోటీ గా వచ్చేందుకు ఏ సినిమా కూడా సాహసం చేయడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం మాత్రమే వారం రోజుల గ్యాప్ లో విడుదల కాబోతుంది. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ సినిమా టీజర్ ని చూసి మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper