Nagarjuna:టాలీవుడ్ సీనియర్ హీరో.. కింగ్ నాగార్జున తన వందవ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే నెల 24న విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి స్పందన వచ్చింది.
ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు కూడా కీలకపాత్రలో నటిస్తోంది. గతంలో నాగార్జున.. టబూజోడికి ప్రేక్షకుల విపరీతమైన ఆదరణ ఉండేది. వీరిద్దరూ కలిసి నిన్నే పెళ్లాడుతా.. సిసింద్రీ వంటి సినిమాలో నటించారు. అప్పట్లో వీరిద్దరి జోడి మీద రకరకాల కామెంట్లు వినిపించేవి. అయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత టబూ నాగార్జునతో జోడి కట్టడం ఈ సినిమా మీద అంచనాలను భారీగా పెంచింది..
నేడు టబు జన్మదిన సందర్భంగా ఈ చిత్ర యూనిట్ చిన్న వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో టబు మహంతి ఝాన్సీ రాణి అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్ర మొత్తం పూర్తిగా నెగిటివ్ షెడ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. మనుషుల్లో రెండు రకాలు ఉంటారని.. అందులో ఒకరు కష్టాన్ని నమ్మేవాళ్ళని.. ఇంకొకరు అదృష్టాన్ని నమ్మే వాళ్ళని.. మహంతి ఝాన్సీ రాణి అనే నేను.. అంటూ టబూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటున్నది.
మరోవైపు టబూ కు సోషల్ మీడియా వేదిక కింగ్ నాగార్జున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్డే టు డియర్ టబు బ్యూటిఫుల్.. ప్రపంచం నిన్ను మర్చిపోదు. నిన్నే పెళ్ళాడుతా నుంచి పండు వరకు.. .. ఇప్పుడు మన జ్ఞాపకాలు మహంతి ఝాన్సీరాణిలో నిక్షిప్తమై ఉంటాయి. నువ్వు ఈ చిత్రాన్ని ఎంతో ప్రత్యేకంగా మార్చావు.. అంటూ నాగార్జున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా టబు పాత్రను నాగార్జున చెప్పకనే చెప్పారు. ఇందులో ఆమె పాత్ర పూర్తి నెగిటివ్ షేడ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థిక మోసాల గురించి.. పీరియాడికల్ డ్రామా లాగా ఈ సినిమా రూపొందినట్టు సమాచారం.
Happy Birthday to Dear #Tabutiful
The world will never forget " పండు" from నిన్నే పెళ్లాడుతా ❤️… and now you’ll be etched in our memories as “Mahanthi Jhansi Rani”
You made this film so special.
Sharing a glimpse to celebrate U and this new fire This time, it’s not love… ⚔️
▶️ https://t.co/9GoO8GazQg
#Tabu
#King100
#HappyBirthdayTabu, .
@ThisIsDSP @Rakarthik_dir @AnnapurnaStdios
— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 4, 2026