spot_img
Homeక్రీడలుక్రికెట్‌Suryakumar Yadav: సూర్యతో ముంబై ఇండియన్స్ చర్చలు.. ఎగ్జిట్ వేళ కీలక పరిణామం.. ఏం జరిగిందంటే?

Suryakumar Yadav: సూర్యతో ముంబై ఇండియన్స్ చర్చలు.. ఎగ్జిట్ వేళ కీలక పరిణామం.. ఏం జరిగిందంటే?

Suryakumar Yadav: టీమిండియా టీ20 జట్టు మాజీ కెప్టెన్‌ సూర్యకుమరా యాదవ్‌పై సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవలే బీసీసీఐ ఆయనను కెప్టెన్సీతోపాటు జట్టు నుంచి కూడా తప్పించింది. ఐపీఎల్‌లో సూర్యకుమార్‌ ఆటతీరుపై అసంతృప్తి, ముంబై ఇండియన్స్‌ జట్టును నడిపించడంలోనూ విఫలమైన తీరు ఆధారంగా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌(ఎస్‌కేవై) భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదే క్రమంలో స్కై ముంబై జట్టు నుంచి కూడా తప్పుకుంటారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్, సూర్కకుమార్‌ యదావ్‌ మధ్య జరిగిన 3 గంటల సుదీర్ఘ సమావేశం ఐపీఎల్‌లో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది.

ముంబై జట్టును అన్‌ఫాలో..
కొన్ని రోజులుగా సూర్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంఐ సంబంధిత పోస్టులు తీసివేయడం, ఫ్రాంచైజీని అన్‌ఫాలో చేయడం వంటి చర్యలతో ట్రాన్స్‌ఫర్, ఎగ్జిట్‌ రూమర్లు జోరుగా వ్యాపించాయి. అయితే ఈ 3 గంటల మీటింగ్‌లో ఫ్రాంచైజీ యాజమాన్యం సూర్యను ఒప్పించడంలో విజయం సాధించింది.

మీటింగ్‌లో చర్చింని అంశాలు..
సమావేశంలో ముఖ్యంగా మూడు కీలక అంశాలపై విస్తృత చర్చ జరిగింది. సూర్యకుమార్‌ దీర్ఘకాలిక రోల్, రాబోయే సీజన్లలో అతనికి ఏ స్థానం ఇవ్వాలి? జట్టు లీడర్‌షిప్‌ గ్రూప్‌లో అతని భవిష్యత్‌ పాత్ర
ఫ్రాంచైజీ భవిష్యత్‌ ప్రణాళికలు, ఐపీఎల్‌ 2027 – ఐ్కఔ 2027 మెగా ఆక్షన్‌ ముందు జట్టు వ్యూహంపై ప్రధానంగా చర్చించారు. ఫ్రాంచైజీ యాజమాన్యం సూర్యకు స్పష్టమైన హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఒక సీజన్‌ కాంట్రాక్టు కంటే మించి, దీర్ఘకాలిక అనుబంధానికి సంకేతాలు ఇచ్చింది.

రూమర్లకు కారణం ఏంటి?
ఈ సంవత్సరం ఐపీఎల్‌ 2026లో సూర్య ఆటతీరు అందరినీ నిరాశపర్చింది. ఫ్యాన్స్, విశ్లేషకుల్లో అనుమానాలు రేకెత్తించింది. అంతేకాకుండా ఇటీవల భారత టీ20 కెప్టెన్‌ పదవి కోల్పోవడం
జాతీయ జట్టు నుంచి డ్రాప్‌ కావడం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంఐ సంబంధిత కంటెంట్‌ తొలగించడం పుకార్లకు కారణమైంది. సూర్య ఎంఐని వదిలేస్తాడు అనే రూమర్లకు బలం చేకూర్చాయి. కొన్ని మీడియా రిపోర్టులు కూడా అతనిని కేకేఆర్, పంజాబ్‌ లాంటి జట్లతో లింక్‌ చేశాయి.

ఎంఐకి కీలక ఆటగాడు..
సూర్య 2018 నుంచి ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్నాడు. 360 డిగ్రీ బ్యాటింగ్‌ స్టైల్‌తో ప్రపంచ గుర్తింపు సాధించాడు టీ20 వరల్డ్‌ కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. మిడిల్‌ ఓవర్లలో అత్యంత ప్రముఖ ఫినిషర్‌లలో ఒకరు. జట్టుకు కేవలం బ్యాటింగ్‌ బలం మాత్రమే కాదు యువ ఆటగాళ్లకు మార్గదర్శకుడు, ఫీల్డింగ్‌ స్టాండర్డ్‌ను ఎత్తైన స్థాయిలో ఉంచేవాడు. అందుకే తాజా సమావేశం ఫలితంగా సూర్య ముంబైతోనే కొనసాగడం ఫ్రాంచైజీకి పెద్ద ఊరట.

3 గంటల మీటింగ్‌ కేవలం ఒక ఆటగాడిని నిలుపుకోవడం కాదు … ఇది ముంబై ఇండియన్స్‌ భవిష్యత్‌ను స్థిరపరచే కీలక నిర్ణయం. సూర్యకుమార్‌ యాదవ్‌ నీలం–గోల్డ్‌ జెర్సీలోనే తన మ్యాజిక్‌ చూపించడం క్రికెట్‌ ప్రేమికులందరికీ సంతోషకరమైన వార్త. ఇక రూమర్లు ముగిసాయి. ఇకపై ఆట మాత్రమే మాట్లాడాల్సిన సమయం ఇది!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular