HomeతెలంగాణMobile Addiction In Teenagers: 15 ఏళ్ల కొడుకు మొబైల్ కు బానిసయ్యాడు.. పోలీసులకు ఫిర్యాదు...

Mobile Addiction In Teenagers: 15 ఏళ్ల కొడుకు మొబైల్ కు బానిసయ్యాడు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు.. తర్వాత ఏమైందంటే..

Mobile Addiction In Teenagers: నేటి కాలంలో చరవాణి అనేది వ్యసనం లాగా మారిపోయింది. మొబైల్ లేకుండా పూట కూడా గడిచే పరిస్థితి లేకుండా పోయింది. రాత్రి కూడా మొబైల్ పక్కన పెట్టుకొని పడుకునే వాళ్ళు చాలామంది. అర్ధరాత్రి దాకా మొబైల్ చూస్తూ.. ఎప్పుడో తెల్లవారుజామున కునుకు తీసేవారు చాలామంది ఉన్నారు. మొబైల్ వ్యసనాన్ని తట్టుకోలేక.. మొబైల్ వాడకాన్ని మానుకోలేక చాలామంది అదే లోకంగా బతుకుతున్నారు. మొబైల్ ద్వారా మాటలు మాత్రమే కాదు ప్రతి ఒక్క పని […]

Mobile Addiction In Teenagers: నేటి కాలంలో చరవాణి అనేది వ్యసనం లాగా మారిపోయింది. మొబైల్ లేకుండా పూట కూడా గడిచే పరిస్థితి లేకుండా పోయింది. రాత్రి కూడా మొబైల్ పక్కన పెట్టుకొని పడుకునే వాళ్ళు చాలామంది. అర్ధరాత్రి దాకా మొబైల్ చూస్తూ.. ఎప్పుడో తెల్లవారుజామున కునుకు తీసేవారు చాలామంది ఉన్నారు. మొబైల్ వ్యసనాన్ని తట్టుకోలేక.. మొబైల్ వాడకాన్ని మానుకోలేక చాలామంది అదే లోకంగా బతుకుతున్నారు.

మొబైల్ ద్వారా మాటలు మాత్రమే కాదు ప్రతి ఒక్క పని జరుగుతున్న నేపథ్యంలో చాలామంది అదే లోకంగా బతుకుతున్నారు. చిన్నపిల్లల నుంచి మొదలుపెడితే పెద్దవాళ్ల వరకు మొబైల్ లోనే జీవితాన్ని గడిపేస్తున్నారు. పక్క వాళ్ళతో కనీసం మాట కూడా మాట్లాడలేదు. ఎదుటివాళ్ళు కనపడినా సరే పలకరించడం లేదు. మొబైల్ లోనే చూస్తూ.. మొబైలే లోకంగా వివరిస్తూ బతికిస్తున్నారు. స్క్రీన్ టైమ్ పెరిగిపోయి చాలామంది దృష్టిలోపాలతో బాధపడుతున్నారు. ఫలితంగా నేత్ర సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా వ్యాధులకు గురయ్యేవారు పెరిగిపోతున్నారు.

ముఖ్యంగా పిల్లలకు ఫోన్ అనేది వ్యసనంగా మారిపోయింది. కోవిడ్ లో ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం వల్ల తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఫోన్లు కొనియాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ ఫోన్లే లోకంగా పిల్లలు బతికేస్తున్నారు. సోషల్ మీడియా చూడటం.. ఇంకా ఇతర వ్యవహారాలకు పాల్పడటంతో పిల్లలు ఫోన్లకు బానిసలు అయిపోయారు. కనీసం తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం లేదు. ఫోన్ లోనే విహరిస్తూ.. అదే లోకంగా విహరిస్తున్నారు. రాత్రి మొత్తం మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారు. సోషల్ మీడియా చూస్తున్నారు. పగటి సమయంలో నిద్ర పోతున్నారు. పిల్లలు ఏకాంతంగా గడపడం.. ఎవరితోనూ మాట్లాడకపోవడం వల్ల వారిలో భావోద్వేగాలు నియంత్రించుకోలేని స్థాయికి దిగజారి పోతున్నాయి.

రాత్రి మొత్తం మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడటం.. సోషల్ మీడియా చూడటం.. పగలు మొత్తం నిద్రపోవడం.. ఇవి అలవాటుగా మార్చుకున్నాడు ఒక 15 సంవత్సరాల బాలుడు. ఇది తప్పని తల్లిదండ్రులు చెబితే.. వారిని దూషిస్తున్నాడు. చివరికి దాడి చేసే స్థాయికి అతడి మొబైల్ వ్యసనం దిగజారిపోయింది. ఈ సంఘటన ఏలూరులో జరిగింది. తట్టుకోలేక తల్లిదండ్రులు భయపడ్డారు. తల్లి ధైర్యం చేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ముందుగా అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి డి అడిక్షన్ సెంటర్లో చేర్పించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper