Homeక్రీడలుక్రికెట్‌Pat Cummins: మా కావ్య పాప నీకేం అన్యాయం చేసింది కమిన్స్ బ్రో.. ఇలా ఎందుకు...

Pat Cummins: మా కావ్య పాప నీకేం అన్యాయం చేసింది కమిన్స్ బ్రో.. ఇలా ఎందుకు చేస్తున్నావ్..

Pat Cummins: అప్పుడెప్పుడో 2016లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. 2024లో ఫైనల్ దాకా వచ్చింది. మధ్యమధ్యలో మెరుపులు మెరిపించింది. ఈ సీజన్లో 4వ స్థానంలో సరిపెట్టుకుంది. అయినప్పటికీ హైదరాబాద్ జట్టు అంటే ఐపీఎల్లో ఒక రకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆ జట్టుకు ఈ స్థాయిలో ఫాలోయింగ్ తీసుకొచ్చిన వారిలో ముఖ్యస్థానంలో ఉంటాడు కెప్టెన్ కమిన్స్. హైదరాబాద్ జట్టుకు ట్రోఫీని అందించాలని కల అతడికి ఎప్పటినుంచి ఉంది. ఈసారి దురదృష్టవశాత్తు అది దూరమైంది. 2024 లో కూడా చివరి […]

Pat Cummins: అప్పుడెప్పుడో 2016లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. 2024లో ఫైనల్ దాకా వచ్చింది. మధ్యమధ్యలో మెరుపులు మెరిపించింది. ఈ సీజన్లో 4వ స్థానంలో సరిపెట్టుకుంది. అయినప్పటికీ హైదరాబాద్ జట్టు అంటే ఐపీఎల్లో ఒక రకమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఆ జట్టుకు ఈ స్థాయిలో ఫాలోయింగ్ తీసుకొచ్చిన వారిలో ముఖ్యస్థానంలో ఉంటాడు కెప్టెన్ కమిన్స్.

హైదరాబాద్ జట్టుకు ట్రోఫీని అందించాలని కల అతడికి ఎప్పటినుంచి ఉంది. ఈసారి దురదృష్టవశాత్తు అది దూరమైంది. 2024 లో కూడా చివరి దశలో ఒత్తిడికి గురి కావడంతో ట్రోఫీ చేజారిపోయింది. అయితే వచ్చే సీజన్లో మాత్రం గట్టిగానే ఆడతామని.. ఈసారి అద్భుతమైన ప్రదర్శన చేస్తామని కమిన్స్ పేర్కొన్నాడు. దీంతో అతడు జట్టును గొప్పగా మార్చుతాడని అందరూ అనుకున్నారు. హైదరాబాద్ అభిమానులు.. హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య బలంగా అనుకుంది. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దీంతో హైదరాబాద్ అభిమానుల్లో ఒక రకమైన సందిగ్ధమైన వాతావరణం నెలకొంది.

2027 ఐపీఎల్ కు కమిన్స్ దూరమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దానికి సంబంధించి అతడు పరోక్షంగా సంకేతాలు ఇచ్చేశాడు..”వచ్చే ఏడాది కాస్త భిన్నంగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఒకదానిని వదులుకోవాల్సి వస్తోంది. అయితే టెస్టులు, వన్డే వరల్డ్ కప్ ను వదులుకునే అవకాశం లేదు. వాటికి అమితమైన ప్రాధాన్యం ఇచ్చేస్తాను. ఇండియాలో ఆస్ట్రేలియా ఆడే అన్ని టెస్ట్ లలో ప్రాతినిధ్యం వహిస్తే.. యాషెస్ సిరీస్ కు నాకు విశ్రాంతి అవసరం. హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాను. నాకు కొన్ని గాయాలయ్యాయి.. అందుకే ఇప్పుడే ఏది స్పష్టంగా చెప్పలేను” అని కమిన్స్ వ్యాఖ్యానించాడు.

ఈ సీజన్లో ప్రారంభ మ్యాచ్లకు అతడు దూరమయ్యాడు. తాత్కాలిక సారథిగా కిషన్ జట్టును నడిపించాడు. అతడి నాయకత్వంలో హైదరాబాద్ జట్టు మెరుగైన విజయాలు సాధించింది.కమిన్స్ జట్టులో ప్రవేశించిన తర్వాత కూడా విజయాలు సాధ్యమయ్యాయి. అయితే చివరి అంచలో రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఓడిపోవడంతో సమీకరణలు పూర్తిగా మారిపోయాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper