Homeక్రీడలుక్రికెట్‌Ajinkya Rahane: సూపర్ రహానే.. నీ స్ఫూర్తి ఎందరికో ఆదర్శం

Ajinkya Rahane: సూపర్ రహానే.. నీ స్ఫూర్తి ఎందరికో ఆదర్శం

Ajinkya Rahane: జీవితం అనేది అందరికీ వడ్డించిన విస్తరి మాదిరిగా ఉండదు. అలాగే క్రికెట్లో కూడా అందరి ఆటగాళ్లకు ఊహించిన విధంగా అవకాశాలు రావు. ప్రతిభ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావలసి ఉంటుంది. అప్పుడు మనం ఎన్ని అనుకున్నా ఉపయోగం ఉండదు. అవకాశా రాలేదు అని తిట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ఇలా అజంక్య రహనే ఎన్నో సందర్భాల్లో అనుకుని ఉంటాడు. జట్టులో రాజకీయాల వల్ల ఎన్నోసార్లు రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యాడు.. […]

Ajinkya Rahane: జీవితం అనేది అందరికీ వడ్డించిన విస్తరి మాదిరిగా ఉండదు. అలాగే క్రికెట్లో కూడా అందరి ఆటగాళ్లకు ఊహించిన విధంగా అవకాశాలు రావు. ప్రతిభ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావలసి ఉంటుంది. అప్పుడు మనం ఎన్ని అనుకున్నా ఉపయోగం ఉండదు. అవకాశా రాలేదు అని తిట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ఇలా అజంక్య రహనే ఎన్నో సందర్భాల్లో అనుకుని ఉంటాడు. జట్టులో రాజకీయాల వల్ల ఎన్నోసార్లు రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యాడు.. అద్భుతమైన ప్రతిభ ఉన్నప్పటికీ ఏమీ చేయలేక.. జస్ట్ మౌన ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయాడు.

రహానే అద్భుతమైన టెస్ట్ క్రికెటర్. ఇదే మాట విరాట్ కోహ్లీ అనేక సందర్భాల్లో చెప్పాడు.. రహానే ఆటగాడు మాత్రమే కాదు.. అంతకుమించిన సారధి కూడా.. అతని నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియా గడ్డమీద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకుంది.. దీనిని బట్టి అతని సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

జట్టులో రాజకీయాల వల్ల
స్థిరమైన స్థానం లభించక చాలా ఇబ్బందిపడ్డాడు. అయినప్పటికీ అతడు తనను తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. గత ఏడాది జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా విఫలం కావడం వల్ల మేనేజ్మెంట్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో రహనే ఉంటే బాగుండు అనే ప్రస్తావన కూడా వచ్చింది.

జాతీయ జట్టుకు రహనే దూరంగా ఉన్నప్పటికీ.. ఐపీఎల్ లో మాత్రం అదరగొడుతున్నాడు. కోల్ కతా జట్టుకు నాయకత్వం వహిస్తూ అతడు.. అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 199 మ్యాచులు ఆడిన ఆటగాడిగా సృష్టించాడు. ఈ జాబితాలో ధోని 278 మ్యాచ్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 273, విరాట్ కోహ్లీ 268, దినేష్ కార్తీక్ 257, రవీంద్ర జడేజా 255, శిఖర్ ధావన్ 222, రవిచంద్రన్ అశ్విన్ 221, సురేష్ రైనా 205, ఊతప్ప 205, అంబటి రాయుడు 204 మ్యాచులు ఆడి.. మిగతా స్థానాలలో కొనసాగుతున్నారు.

రహనే కు సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ లేకపోవచ్చు. అతడు ఉద్రేకమైన ఆట ఆడకపోవచ్చు. బట్ కంగారులను మాత్రం ఓడించాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper