Homeఎంటర్టైన్మెంట్Rajinikanth Movie Heroine Rejected: రజినీకాంత్ ని కొట్టడం ఇష్టం లేక సినిమానే వదులుకున్న క్రేజీ...

Rajinikanth Movie Heroine Rejected: రజినీకాంత్ ని కొట్టడం ఇష్టం లేక సినిమానే వదులుకున్న క్రేజీ స్టార్ హీరోయిన్..

Rajinikanth Movie Heroine Rejected: సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) ని తమిళియన్స్ ఒక దేవుడి లాగా చూస్తారు అనే సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొన్ని రాష్ట్రాల పేర్లు తీస్తే , మనకి ఆ రాష్ట్రాల్లో పాపులర్ ప్రదేశాలు గుర్తుకు వస్తుంటాయి. కానీ తమిళనాడు పేరు తీస్తే మనకు సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది. నాలుగు దశాబ్దాల నుండి తమిళనాడు రాష్ట్రాన్ని ఆ రేంజ్ లో సినీ పరిశ్రమ నుండి […]

Rajinikanth Movie Heroine Rejected: సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) ని తమిళియన్స్ ఒక దేవుడి లాగా చూస్తారు అనే సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొన్ని రాష్ట్రాల పేర్లు తీస్తే , మనకి ఆ రాష్ట్రాల్లో పాపులర్ ప్రదేశాలు గుర్తుకు వస్తుంటాయి. కానీ తమిళనాడు పేరు తీస్తే మనకు సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది. నాలుగు దశాబ్దాల నుండి తమిళనాడు రాష్ట్రాన్ని ఆ రేంజ్ లో సినీ పరిశ్రమ నుండి శాసిస్తున్నాడు ఆయన. ప్రస్తుతం ఆయన వయస్సు 75 ఏళ్ళు. ఇప్పటికీ నేటి తరం సూపర్ స్టార్స్ తో పోటీగా సినిమాలు చేయడమే కాదు , వాళ్ళతో సమానంగా రికార్డ్స్ కూడా పెడుతున్నాడు. ఇప్పటి తరం స్టార్ హీరోలు ఆ వయస్సులో అసలు ఎలా ఉంటారో కూడా ఊహించుకోలేము. ఇదంతా పక్కన పెడితే , అలాంటి సూపర్ స్టార్ సినిమాలో మెయిన్ హీరోయిన్ రోల్ వస్తే ఎవరైనా వదులుకుంటారా చెప్పండి?..

కానీ ఒక స్టార్ హీరోయిన్ వదులుకుంది అట. ఆమె మరెవరో కాదు, కుష్బూ. అప్పట్లో ఈమెకు తమిళనాడు లో ఎలాంటి క్రేజ్ ఉండేదో అందరికీ తెలిసిందే. తమిళం లో ఆమె వాసు దర్శకత్వం లో ప్రభు హీరో గా నటించిన ”చిన్న తంబీ’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అప్పట్లో ఒక సంచలన. తెలుగు లో ఈ చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ ‘చంటి’ పేరు తో రీమేక్ చేసాడు. ఇక్కడ కూడా ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అయితే ‘చిన్నతంబీ’ చిత్రం తర్వాత వాసు సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘ఘరానా మొగుడు’ రీమేక్ ”మన్నన్’ చేసాడు. ఈ సినిమాలో నగ్మా క్యారక్టర్ కోసం కుష్బూ ని సంప్రదించాడట డైరెక్టర్ వాసు. ఆమెకు కథ బాగానే నచ్చింది కానీ , అందులో రజినీకాంత్ ని కొట్టే ఒక సన్నివేశం ఉండడం తో ‘ఆమ్మో అలాంటి సన్నివేశం లో నేను నటించలేను’ అని చెప్పి ఆ పాత్రని వదిలేసుకుందట.

అందుకు కారణం చెప్తూ ‘రజినీకాంత్ ని కొట్టే హీరోయిన్ పాత్ర అంటే , అవతల వైపు ఆయన రేంజ్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ ఉండాలి. నేను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీ లో ఎదుగుతున్న హీరోయిన్. నాలాంటి వాళ్ళు ఆయన్ని కొడితే అభిమానులు థియేటర్స్ లో స్క్రీన్స్ ని చింపేస్తారు. రజినీకాంత్ కి ఆ స్థాయి క్రేజ్ ఉంది. కాబట్టి నేను ఆ పాత్ర చెయ్యలేను. కానీ రజినీకాంత్ గారి సినిమాలో నటించాలని నాకు కోరిక ఉంది. కాబట్టి అందులో చిన్న పాత్ర దొరికిన చేస్తాను. సెకండ్ హీరోయిన్ పాత్ర చేయడానికి రెడీ’ అని డైరెక్టర్ కి చెప్పిందట కుష్బూ. అప్పుడు డైరెక్టర్ వాసు ‘ఘరానా మొగుడు’ లోని వాని విశ్వనాధ్ పాత్రని కుష్బూ కి ఇచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper