Homeఎంటర్టైన్మెంట్Top Director: స్టార్ హీరోలందరితో సినిమాలను చేసిన టాప్ డైరెక్టర్...కానీ ఎవ్వరికి హిట్ ఇవ్వలేదు...

Top Director: స్టార్ హీరోలందరితో సినిమాలను చేసిన టాప్ డైరెక్టర్…కానీ ఎవ్వరికి హిట్ ఇవ్వలేదు…

Top Director: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేసే సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ ఉంటారు. అందువల్లే వాళ్ళతో దర్శకులు సినిమాలను చేసి వాళ్ళు కూడా టాప్ డైరెక్టర్ గా మారాలనే ప్రయత్నం చేస్తుంటారు. అదే ఒక టాప్ డైరెక్టర్ కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలను చేసినప్పటికి వాళ్ళకెవరికి సక్సెస్ లను అందజేయలేదు. ఇంతకీ ఆ టాప్ డైరెక్టర్ ఎవరు అంటే బి.గోపాల్ కావడం విశేషం… చిరంజీవి, […]

Top Director: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేసే సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ ఉంటారు. అందువల్లే వాళ్ళతో దర్శకులు సినిమాలను చేసి వాళ్ళు కూడా టాప్ డైరెక్టర్ గా మారాలనే ప్రయత్నం చేస్తుంటారు. అదే ఒక టాప్ డైరెక్టర్ కొంతమంది స్టార్ హీరోలతో సినిమాలను చేసినప్పటికి వాళ్ళకెవరికి సక్సెస్ లను అందజేయలేదు. ఇంతకీ ఆ టాప్ డైరెక్టర్ ఎవరు అంటే బి.గోపాల్ కావడం విశేషం… చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోలందరితో సినిమాలను చేసి మంచి విజయాలను అందించినప్పటికి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలకు మాత్రం సక్సెస్ లను సాధించి పెట్టలేకపోయాడు. మహేష్ బాబుతో వంశీ అనే సినిమా చేశాడు. ఆ మూవీ డిజాస్టర్ గా మారింది.

ఎన్టీఆర్ తో అల్లరి రాముడు, నరసింహుడు అనే రెండు సినిమాలు చేశాడు. ఆ రెండు సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి. ప్రభాస్ తో ‘అడవి రాముడు’ అనే సినిమా చేశాడు. అది కూడా డిజాస్టర్ గా మారింది. ఇక ఏది ఏమైనా కూడా ఈ దర్శకుడు సీనియర్ హీరోలకు అందించిన సక్సెస్ లను వాళ్ళ తర్వాత తరం హీరోలకు అందించలేకపోయారు…

ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలతో గొప్ప గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆయనకు అవకాశాలను ఇచ్చే హీరోలు మాత్రం కరువైపోయారు. ఒకప్పుడు తను మాస్ డైరెక్టర్ గా పలు రికార్డులను క్రియేట్ చేశాడు. అయినప్పటికి ఇప్పుడు మాత్రం అతనికి పూర్తిగా మార్కెట్ డౌన్ అయిపోయింది. దాదాపు ఇండస్ట్రీ నుంచి ఫేడౌట్ అయిపోయాడనే చెప్పాలి…

మరోసారి మంచి కథతో ప్రేక్షకులను మెప్పించడానికి వస్తే బాగుంటుందని అతని అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఆయన మరో కథతో మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే విధంగా కమర్షియల్ సినిమాని చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper