Homeక్రీడలుక్రికెట్‌SRH Vs RCB: బెంగళూరు మీద గెలవడమే కాదు.. ఈ సమీకరణాలు సాధ్యమైతేనే సన్ రైజర్స్...

SRH Vs RCB: బెంగళూరు మీద గెలవడమే కాదు.. ఈ సమీకరణాలు సాధ్యమైతేనే సన్ రైజర్స్ కు రెండో స్థానం..

SRH Vs RCB: ఐపీఎల్ గ్రూప్ దశ సమరం ముగింపునకు వచ్చింది. ప్లే ఆఫ్ లోకి బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ వెళ్ళిపోయాయి. నాలుగు స్థానం కోసం కోల్కతా, రాజస్థాన్ పోటీ పడుతున్నాయి. రాజస్థాన్ కాస్త ముందంజలో ఉన్నప్పటికీ.. తదుపరి మ్యాచ్లో గెలిస్తేనే ఆ జట్టుకు ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కోల్కతా కూడా వరుస విజయాలు సాధిస్తోంది కాబట్టి.. ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు ఆ జట్టుకు ఉన్నాయి. తదుపరి మ్యాచ్ లు గెలవడం మాత్రమే […]

SRH Vs RCB: ఐపీఎల్ గ్రూప్ దశ సమరం ముగింపునకు వచ్చింది. ప్లే ఆఫ్ లోకి బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ వెళ్ళిపోయాయి. నాలుగు స్థానం కోసం కోల్కతా, రాజస్థాన్ పోటీ పడుతున్నాయి. రాజస్థాన్ కాస్త ముందంజలో ఉన్నప్పటికీ.. తదుపరి మ్యాచ్లో గెలిస్తేనే ఆ జట్టుకు ప్లే ఆఫ్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది. కోల్కతా కూడా వరుస విజయాలు సాధిస్తోంది కాబట్టి.. ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు ఆ జట్టుకు ఉన్నాయి. తదుపరి మ్యాచ్ లు గెలవడం మాత్రమే కాకుండా.. రాజస్థాన్ జట్టు ఓడిపోతే ఆ జట్టుకు లైన్ క్లియర్ అవుతుంది.

ప్లే ఆఫ్ వెళ్లిన జట్లలో హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్ జట్టు లీగ్ దశలో తన చివరి మ్యాచ్ శుక్రవారం బెంగళూరు తో ఆడుతోంది. ఈ మ్యాచ్ లో కనుక హైదరాబాద్ విజయం సాధిస్తే జట్టు ఖాతాలో 18 పాయింట్లు ఉంటాయి. ఫలితంగా బెంగళూరు, గుజరాత్ జట్లతో హైదరాబాద్ సమానంగా నిలుస్తుంది. ఈ మ్యాచ్లో ఓడిపోయినంత మాత్రాన బెంగళూరుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ జట్టు ఖాతాలో నెట్ రన్ రేట్ 1.065 ఉంది. గుజరాత్ జట్టు ఖాతాలో కూడా నెట్ రన్ రేట్ 0.695 ఉంది. గుజరాత్ ను పక్కనపెట్టి రెండవ స్థానంలోకి హైదరాబాద్ వెళ్లాలంటే కచ్చితంగా విజయం మాత్రమే కాకుండా. అంతకుమించి అనే స్థాయిలో గెలుపును దక్కించుకోవాలి.

శుక్రవారం బెంగళూరులో జరిగే మ్యాచ్లో హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేసి 220 పరుగులు సాధించాలి. అంతేకాదు 88 పరుగుల వ్యత్యాసంతో బెంగళూరు మీద గెలుపును దక్కించుకోవాలి. ఒకవేళ టార్గెట్ ఫినిష్ చేసే క్రమంలో.. బెంగళూరు కనక 150 పరుగుల లక్ష్యాన్ని విధిస్తే.. దానిని 11.1 నుంచి 11.3 ఓవర్లలో పూర్తి చేయాలి. అప్పుడే హైదరాబాద్ జట్టు నెట్ రన్ రేట్ పెరుగుతుంది. తద్వారా రెండవ స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. రెండో స్థానానికి చేరుకుంటే ఎలిమినేటర్ మ్యాచ్ ఆడే అవకాశం కూడా ఉంటుంది. బెంగళూరు.. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 200కు పైగా లక్ష్యాన్ని విధించినప్పటికీ.. బెంగళూరు ఈజీగా ఫినిష్ చేసింది. ఇప్పుడు బెంగళూరు జట్టును ఓడించి ఈ సీజన్ లో తొలి ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని హైదరాబాద్ భావిస్తుంది.

కేవలం గెలుపు మాత్రమే కాదని.. భారీ వ్యత్యాసంతో గెలవాలని.. అప్పుడే రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉంటుందని హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. బెంగళూరు జట్టుతో జరిగే మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు అంతకుమించి అనే స్థాయిలో ప్రదర్శన చేయాలని.. అప్పుడే ఆశించిన లక్ష్యం సాధ్యమవుతుందని అభిమానులు భావిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper