Homeక్రీడలుక్రికెట్‌SRH Vs Kolkata: బౌలింగే కాదు..బ్యాటింగూ పూరే.. సన్ రైజర్స్ కు ఏంటీ దరిద్రం

SRH Vs Kolkata: బౌలింగే కాదు..బ్యాటింగూ పూరే.. సన్ రైజర్స్ కు ఏంటీ దరిద్రం

SRH Vs Kolkata: ఇన్నాళ్లపాటు సన్ రైజర్స్ బౌలింగ్ మాత్రమే పూర్ అని అందరూ అనుకునే వారు. కానీ ఇప్పుడు బ్యాటింగ్ లోనూ హైదరాబాద్ జట్టు నేల చూపులు చూస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టు దారుణంగా ఆడుతోంది. బ్యాటింగ్ పరంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు సన్ రైజర్స్ అభిమానులను కలవర పరుస్తోంది. తొలి మ్యాచ్ లో అభిషేక్ శర్మ,హెడ్ సరిగ్గా ఆడలేదు. దీంతో జట్టు భారం కెప్టెన్ ఇషాన్ కిషన్ మీద పడింది. అతడు […]

SRH Vs Kolkata: ఇన్నాళ్లపాటు సన్ రైజర్స్ బౌలింగ్ మాత్రమే పూర్ అని అందరూ అనుకునే వారు.
కానీ ఇప్పుడు బ్యాటింగ్ లోనూ హైదరాబాద్ జట్టు నేల చూపులు చూస్తోంది. ప్రస్తుత
ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టు దారుణంగా ఆడుతోంది. బ్యాటింగ్ పరంగా ఎదురవుతున్న
ఒడిదుడుకులు సన్ రైజర్స్ అభిమానులను కలవర పరుస్తోంది.

తొలి మ్యాచ్ లో అభిషేక్ శర్మ,హెడ్ సరిగ్గా ఆడలేదు. దీంతో జట్టు భారం కెప్టెన్ ఇషాన్ కిషన్
మీద పడింది. అతడు వీరోచితమైన బ్యాటింగ్ చేయడంతో సన్ రైజర్స్ 200 ప్లస్ స్కోర్ చేసింది.
ఆ స్కోరును కాపాడుకోలేకపోయింది సన్ రైజర్స్. బౌలర్లు దారుణంగా బౌలింగ్ చేయడంతో
సన్ రైజర్స్ ఓటమి మూట కట్టుకోవాల్సి వచ్చింది. సన్ రైజర్స్ బౌలర్ల నిర్లక్ష్యమైన బౌలింగ్ ను
బెంగళూరు ఆటగాళ్లు పండగ చేసుకున్నారు.

తొలి మ్యాచ్ లో ఓటమి ఎదురైన నేపథ్యంలో గురువారం కోల్ కతాతో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్
ముందుగా బ్యాటింగ్ చేసింది. సన్ రైజర్స్ ఓపెనర్లు హెడ్(46), అభిషేక్ శర్మ(48) దూకుడుగా బ్యాటింగ్ చేశారు.
5.4 ఓవర్లలోనే ఈ జోడి 82 పరుగులు చేసింది. హెడ్ ఔట్ అయిన తర్వాత కెప్టెన్ కిషన్ (14) ఔట్ అయ్యాడు. 111
పరుగుల వద్ద సన్ రైజర్స్ రెండో వికెట్ కోల్పోయింది. దీంతో మైదానంలో మ్యాచ్ చూస్తున్న అభిమానులు
ఒక్కసారిగా నిశ్శబ్దంగా ఉండిపోయారు.

112 పరుగుల వద్ద ప్రమాదకరమైన అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. మరో ఆరుపరుగులు జమ అయ్యాయో లేదో
అనికేత్ వర్మ్(1) ఔట్ అయ్యాడు. ఈ దశలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి(39) దూకుడుగా బ్యాటింగ్
చేశాడు. క్లాసెన్(52)హాఫ్ సెంచరీ చేయడంతో సన్ రైజర్స్ కాస్త ఊపిరి పీల్చుకుంది. వీరిద్దరూ ఔట్ అయిన తర్వాత
చాలా ఇబ్బంది పడింది. వాస్తవానికి సన్ రైజర్స్ కు లభించిన ఆరంభాన్ని చూస్తే 250 స్కోర్ సాధ్యమవుతుందని
అందరూ అనుకున్నారు.కానీ మిడిల్ ఆర్డర్ లో లోపం, కొంతమంది ప్లేయర్ల నిర్లక్ష్యం వల్ల సన్ రైజర్స్ 226
పరుగులు మాత్రమే చేయగలిగింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper