Homeక్రీడలుక్రికెట్‌Sunrisers Hyderabad Batting Collapse: అభిషేక్ శర్మ కు ఇక రాదు.. హెడ్ కు అర్థం...

Sunrisers Hyderabad Batting Collapse: అభిషేక్ శర్మ కు ఇక రాదు.. హెడ్ కు అర్థం కాదు.. కిషన్ వల్ల కాలేదు.. 300 లోడింగ్ అంటే జరిగింది ఇదీ..

Sunrisers Hyderabad Batting Collapse: ఎండ దంచికొడుతోంది. సన్ రైజర్స్ లో కాటేరమ్మ కొడుకులు దంచి కొడతారని ఉప్పల్ స్టేడియానికి భారీగా అభిమానులు వచ్చారు. ఎండను సైతం లెక్క చేయకుండా పరుగుల వరదను ఆస్వాదించాలని అనుకున్నారు. పైగా ఉప్పల్ మైదానంలో అద్భుతమైన రికార్డు ఉండటంతో బౌండరీల మోత, సిక్సర్ల ప్రవాహం ఉంటుందని సగటు సన్ రైజర్స్ అభిమాని భావించాడు. ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఆటగాళ్లు ఇన్నింగ్స్ ను వేగంగా ప్రారంభించలేదు. సన్ రైజర్స్ […]

Sunrisers Hyderabad Batting Collapse: ఎండ దంచికొడుతోంది. సన్ రైజర్స్ లో కాటేరమ్మ కొడుకులు దంచి కొడతారని ఉప్పల్ స్టేడియానికి భారీగా అభిమానులు వచ్చారు. ఎండను సైతం లెక్క చేయకుండా పరుగుల వరదను ఆస్వాదించాలని అనుకున్నారు. పైగా ఉప్పల్ మైదానంలో అద్భుతమైన రికార్డు ఉండటంతో బౌండరీల మోత, సిక్సర్ల ప్రవాహం ఉంటుందని సగటు సన్ రైజర్స్ అభిమాని భావించాడు.

ముందుగా బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ ఆటగాళ్లు ఇన్నింగ్స్ ను వేగంగా ప్రారంభించలేదు. సన్ రైజర్స్ పూర్వ ఆటగాడు, ప్రస్తుత లక్నో బౌలర్ మహమ్మద్ షమీ బంతిని అందుకున్నాడు. వరుసగా పదునైన బంతులు వేసి హెడ్ ను ఇబ్బంది పెట్టాడు. చివరికి ఒక సింగిల్ తీసి హెడ్ తన మీద ఉన్న ఒత్తిడి తగ్గించుకున్నాడు. నాన్ స్ట్రైకర్ గా ఉన్న అభిషేక్ బ్యాట్ అందుకున్నాడు. ఎదుర్కొన్న తొలబంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి కాస్త బ్యాట్ ఎడ్జ్ తాకింది.

అక్కడే కాచుకుని ఉన్న సిద్దార్థ అద్భుతమైన క్యాచ్ అందుకుని ఔట్ చేశాడు. దీంతో అభిషేక్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. సున్నా పరుగులకు అభిషేక్ ఔట్ కావడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భారీగా అంచనాలు పెట్టుకుని వస్తే ఇలా చేశావేంటని మండిపడుతున్నారు.

అభిషేక్ ఔట్ అయిన తర్వాత హెడ్ కూడా ఇబ్బందిపడుతూ కనిపించాడు. దిగ్వేష్ రాటి బౌలింగ్ లో ఫోర్ కొట్టి సౌకర్యవంతంగా కనిపించిన అతడు.. షమీ బౌలింగ్ లో ఒత్తిడి ఎదుర్కొన్నాడు. హెడ్ లోపం తెలుసుకాబట్టి బ్యాకప్ లెంత్ తో బంతిని వేస్తే దానిని మిడాఫ్ లోకి ఆడాడు. అక్కడే ఉన్న మార్క్రం అద్భుతంగా అందుకున్నాడు. దీంతో సింగిల్ డిజిట్ స్కోర్ కే ఓపెనర్లు పెవిలియన్ వెళ్లిపోయారు.

300 స్కోర్ లోడింగ్ అనుకుంటే కనీసం రెండు పదుల స్కోరు చేయకుండానే ఓపెనర్లు వెళ్లిపోవడం సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులను కుంగదీస్తోంది.తొలి మ్యాచ్ లో కూడా అభిషేక్, హెడ్ ఇలానే ఆడారు. అప్పుడు కెప్టెన్ ఇషాన్ కిషన్ వీరోచితంగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు కూడా జట్టు భారం మొత్తం ఇషాన్ కిషన్ మీద పడింది. అయితే అతడు కూడా చేతులెత్తేశాడు. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో సన్ రైజర్స్ 11 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper