spot_img
Homeక్రీడలుక్రికెట్‌BCCI vs Bangladesh Cricket Board Controversy: బీసీసీఐతో బంగ్లా క్రికెట్ బోర్డు కాళ్ల బేరం.....

BCCI vs Bangladesh Cricket Board Controversy: బీసీసీఐతో బంగ్లా క్రికెట్ బోర్డు కాళ్ల బేరం.. తలవంచుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

BCCI vs Bangladesh Cricket Board Controversy: అన్నం మీద అలిగితే కడుపు మారుతుంది. పారే నది మీద అలక బూనితే గొంతు ఎండుతుంది. అన్నం సంపాదించుకోలేని స్థాయి ఉన్నప్పుడు.. నీటిని తెచ్చుకునే సత్తా లేనప్పుడు అన్ని మూసుకోవాలి. లేని అహాలకు వెళితే దూల తీరుతుంది.

పై ఉపోద్ఘాతం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు నూటికి నూరు శాతం సరిపోతుంది. బంగ్లాదేశ్లో ఆమధ్య హిందువులను వరుసగా హతమార్చారు. మైనారిటీలుగా ఉన్న హిందువులకు నరకం చూపించారు. ఈ పరిస్థితులను భారత్ తీవ్రంగా ఎండగట్టింది. ఇది సరైన విధానం కాదని మండిపడింది. అంతేకాదు కోల్ కతా జట్టు యాజమాన్యం కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ ఆటగాడిని వెనక్కి పంపించింది. ఇది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో వెంటనే టి20 వరల్డ్ కప్ లో తాము భారతదేశంలో అడుగుపెట్టబోమని.. తమకు న్యూట్రల్ వేదికలో ఆడించే అవకాశం కల్పించాలని వితండవాదాన్ని తలకెత్తుకుంది. దీంతో భారత క్రికెట్ బోర్డ్ యాజమాన్యానికి కాలింది. అంతేకాదు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు లేవనెత్తిన గొంతెమ్మ కోరికలను తీసి అవతల పెట్టింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు పాకిస్తాన్ వంత పాడింది. ఎట్టి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు భారత గడ్డమీద అడుగుపెట్టరని.. తమ మాదిరిగానే న్యూట్రల్ వేదిక లో ఆడే అవకాశం కల్పించాలని సపోర్ట్ గా మాట్లాడింది. కొద్దిరోజుల పాటు అటు బంగ్లాదేశ్.. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డులు లేవనెత్తిన డిమాండ్లను బీసీసీఐ విన్నది. కొంత సమయం కూడా ఇచ్చింది. ఆ తర్వాత తీసి పక్కన పెట్టింది.

బిసిసిఐ స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్న తర్వాత ఐసిసి కూడా దానిని అమలు చేయాల్సిందే. ఐసీసీ దిగి రాకపోవడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు టి20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుంది. పాకిస్తాన్ మాత్రం తెలివిగా కొద్దిరోజులు గేమ్ ప్లే చేసింది. ఆ తర్వాత భారత జట్టుతో శ్రీలంకలో ఆడేందుకు ఒప్పుకుంది. ఇక్కడ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎర్రబుగ్గ అయిపోయింది. భారత్లో టి20 వరల్డ్ కప్ లో ఆడక పోవడం వల్ల బంగ్లాదేశ్ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. అంతేకాదు లోకల్ గా కూడా పరిస్థితులు బాగా లేకపోవడంతో అక్కడ క్రికెట్ బోర్డు ఆదాయం కోసం అనేకదారులను వెతుకుతున్నది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీసీఐ పెద్దలతో మంతనాలు మొదలుపెట్టింది. కాళ్ళ బేరానికి సిద్ధమని సంకేతాలు పంపింది.. తాను భారత క్రికెట్ బోర్డుతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఒక లేఖ కూడా రాసింది.

గతంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భారత జట్టుతో పర్యటనకు నిరాకరించింది. అంతేకాదు భారత్ లో పరిస్థితులు బాగోలేదని లేనిపోని ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఆదాయం లేకపోవడం.. క్రికెట్ మనుగడ ప్రమాదంలో పడుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ పునరాలోచనలో పడింది.. భారత జట్టుతో మ్యాచులు లేకుంటే ఆదాయం లేదని భావించి.. కాళ్ళ బేరానికి వస్తున్నట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్తాన్ కు ఏమాత్రం మింగుడు పడడం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Pooja Hegde

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే కి క్షమాపణలు చెప్పిన ‘జన నాయగన్ ‘ డైరెక్టర్.. అసలు ఏమైందంటే..

Pooja Hegde: ఎన్నో అడ్డంకులను ఎదురుకొని , అసలు థియేటర్స్ లోకి వస్తుందా లేదా అనే సందిగ్ద పరిస్థితుల నడుమ , ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,...

TANA : ఛార్లెట్‌లో తానా సేవా స్పూర్తి.. 21 యూనిట్ల రక్తదానంతో 63 మందికి ప్రాణాధారం!

TANA : సేవా కార్యక్రమాలకు ఎప్పుడూ ముందుండే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సామాజిక బాధ్యతను చాటుకుంది. అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ'...
Meher Ramesh Family Tragedy

Meher Ramesh Family Tragedy: మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం.. హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరిన పవన్...

Meher Ramesh Family Tragedy: రీసెంట్ గానే ప్రముఖ దర్శకుడు మెహర్ రమేష్ తన కూతురు వివాహాన్ని ఎంత గ్రాండ్ గా జరిపించారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ చిరంజీవి కుటుంబానికి...
Kiran Abbavaram

Kiran Abbavaram: సంబరాల ఏటి గట్టు మూవీ కిరణ్ అబ్బవరం చేయాల్సిందా…ఎలా మిస్సయ్యింది…

Kiran Abbavaram: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. వాళ్ళు చేస్తున్న సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం...
Balakrishna Injury

Balakrishna Injury: బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు సంచలన ప్రకటన.. ఆందోళనలో ఫ్యాన్స్..

Balakrishna Injury: కాకినాడ లో గత కొద్దిరోజుల నుండి NBK111 విరామం లేకుండా షూటింగ్ జరుగుతుండగా, నిన్న ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్న సమయంలో బాలయ్య మోకాలికి గాయమైన...
Oktelugu Epaper