Homeక్రీడలుSmriti Mandhana marriage: స్మృతికి త్వరలోనే పెళ్లి .. వరుడు అతడే

Smriti Mandhana marriage: స్మృతికి త్వరలోనే పెళ్లి .. వరుడు అతడే

Smriti Mandhana marriage: చాలా కాలం పాటు ప్రేమలో ఉన్నారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. అభిప్రాయాలు కలిశాయి. కుటుంబాలు కూడా కలిశాయి. అతడేమో సంగీత దర్శకుడు. ఆమె పేరు పొందిన క్రికెటర్. సెలబ్రిటీలు అయినప్పటికీ సాధారణ ప్రేమికులుగానే కొనసాగారు. చివరికి తమ ప్రేమను మరో స్థాయికి తీసుకెళ్లాలనుకున్నారు. కాని చివర్లో వారు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఫలితంగా వారి పెళ్లి క్యాన్సిల్ అయింది. స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలుసు. పైగా […]

Smriti Mandhana marriage: చాలా కాలం పాటు ప్రేమలో ఉన్నారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారు. అభిప్రాయాలు కలిశాయి. కుటుంబాలు కూడా కలిశాయి. అతడేమో సంగీత దర్శకుడు. ఆమె పేరు పొందిన క్రికెటర్. సెలబ్రిటీలు అయినప్పటికీ సాధారణ ప్రేమికులుగానే కొనసాగారు. చివరికి తమ ప్రేమను మరో స్థాయికి తీసుకెళ్లాలనుకున్నారు. కాని చివర్లో వారు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఫలితంగా వారి పెళ్లి క్యాన్సిల్ అయింది.

స్మృతి మందాన, పలాష్ ముచ్చల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలుసు. పైగా వారు తమ ప్రేమను దాచుకోవాలని అనుకోలేదు. సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు బయటికి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే భారత మహిళల జట్టు టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత స్మృతి కి నేరుగా వెళ్లి పలాష్ పెళ్లి ప్రపోజల్ చేశాడు. దానికి ఆమె సిగ్గుపడుతూ ఒప్పుకుంది. టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత.. పలాష్, స్మృతి వివాహానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. మహారాష్ట్రలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో వీరిద్దరి పెళ్లికి ఘనంగా ఏర్పాటు చేశారు. ఇంతలోనే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఫలితంగా పెళ్లి వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. స్మృతి తండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మీడియాలో మరో వార్త సర్కిలేట్ అయింది. ఈసారి పెళ్లి క్యాన్సిల్ అయిందని.. ఇకపై రెండు కుటుంబాల మధ్య ఎటువంటి సంబంధాలు ఉండవని ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

పలాష్ మరో మహిళతో సంబంధం కొనసాగించాడని.. ఆ విషయం స్మృతికి తెలిసిందని.. అందువల్లే అతడిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోలేదని తెలిసింది. అందువల్లే స్మృతి ముందస్తు పెళ్లి వేడుకలో భాగమైన భారత మహిళా క్రికెటర్లు.. దానికి సంబంధించిన ఫోటోలను మొత్తం సోషల్ మీడియాలో డిలీట్ చేశారు. దీంతో అప్పుడే చాలామందిలో అనుమానం కలిగింది. చివరికి పెళ్లి రద్దు కావడంతో అందరికీ ఒక క్లారిటీ వచ్చింది.

ఇటీవల పలాష్ సోదరి, పాప్ సింగర్ పాలక్ స్మృతి తల్లిని కలిసింది. ఒక కేఫ్ వద్ద స్మృతి తండ్రి కనిపించగా.. అతనికి ఆమె వినయపూర్వకంగా పాదాలకు నమస్కరించింది. దీంతో ఆయన కూడా ఆమెను పెద్ద మనసుతో దీవించారు. ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనం కలిగించింది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం రెండు కుటుంబాల మధ్య సయోధ్య కుదిరిందని.. త్వరలోనే స్మృతి మెడలో పలాష్ మూడు ముళ్ళు వేస్తాడని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై స్మృతి ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ ప్రకారం చూసుకుంటే ఇదంతా కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమేనని తెలుస్తోంది. గతంలో రెండు కుటుంబాల మధ్య బలమైన సంబంధాలు ఉండడంతో పాలక్ స్మృతి తండ్రి కనిపించగానే పాదాలకు నమస్కరించిందని.. రెండు కుటుంబాల మధ్య అంతకుమించి ఇప్పుడు ఏమీ లేదని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.

 

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper